ఆయన సపోర్టు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు : ఉత్తరాఖండ్‌ సీఎం

28 Nov, 2023 21:48 IST|Sakshi

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్నవారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌ విజయం సాధించింది. 41 మంది కార్మికులను సురక్షితంగా సొరంగంనుంచి బయటికి తీసుకువచ్చారు. అనంతరం వారిని ఆసుపత్రికి  తరలించారు.  17 రోజులు సుదీర్ఘ నిరీక్షణ తరువాత వారంతా ఈసంక్షోభం నుంచి బైటపడటంతో కార్మికుల కుటుంబాలు, రెస్క్యూ సిబ్బందితోపాటు, దేశ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో భాగమైన సభ్యులందరికీ  కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి మోదీ  నిరంతరం తనతో టచ్‌లో ఉంటూ,  రెస్క్యూ ఆప్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు  తెలుసుకున్నారనీ పలు సలహాలిచ్చారని సీఎం వెల్లడించారు.  (ఉత్తరాఖండ్‌ టన్నెల్‌: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్)

ఎలాగైనా అందరినీ క్షేమంగా రక్షించడమే కర్త్యవ్యంగా పెట్టుకున్నాననీ, ఈ విషయంలో ప్రధాని సపోర్టు లేకుంటేఇది సాధ్యమయ్యేది కాదంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాదు  కార్మికులందరికీ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించి, క్షేమంగా  ఇళ్లకు చేరేలా అన్ని సౌకర్యాలు కల్పించాలని  మోదీ తనను ఆదేశించారని వెల్లడించారు. కాగా  ఈ విజయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానిమోదీ,  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తదితర  ప్రముఖులు  సోషల్‌ మీడియా ద్వారా  ఆనందాన్ని ప్రకటించారు. (ఇంత కన్నా గొప్ప విజయం ఏముంటుంది : ఆనంద్‌ మహీంద్ర)

(అద్భుతం..ఉద్వేగమైన క్షణాలివి: ఆనందోత్సాహాల వెల్లువ)

మరిన్ని వార్తలు