వణికిస్తున్న జ్వరాలు

22 Jul, 2016 00:17 IST|Sakshi
ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న కస్తూర్బా విద్యార్థినులు
  • పాల్వంచ ఆస్పత్రిలో 28మందికి చికిత్స
  • పాల్వంచ రూరల్‌: విషజ్వరాలతో బాధ పడుతూ పాల్వంచ ఏరియా ఆస్పత్రికి వస్తున్న పీడితుల సంఖ్య పెరుగుతోంది. గురువారం దాదాపు 30మంది వరకు జ్వరంతో బాధ పడుతూ రాగా..23మంది టైఫాయిడ్, మరొకరు మలేరియా జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యపరీక్షల్లో తేలింది. ఇందిరానగర్‌ కాలనీలోని కస్తూర్బాగాంధీ విద్యాలయం విద్యార్థినులు జ్వరంతో బాధపడుతున్నారు. పదో తరగతి బాలికలు డి.సంధ్య, బి.బేబి, వెన్నెల తదితరులు తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురికాగా బాధ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన 5వ తరగతి విద్యార్థి జె.కార్తీక్‌ను ఇక్కడ చేర్పించారు. సమీప గ్రామస్తులు, ఇటు విద్యార్థులు హాస్పిటల్‌కు రావడంతో బెడ్లు సరిపోలేదు. కొన్ని పడకలపై ఇద్దరి చొప్పున పడుకోబెట్టి వైద్యచికిత్స నిర్వహించారు. రక్త పరీక్షలు చేయించుకునేందుకు రోగులు బారులు తీరారు. ఇంకా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా పలువురు జ్వరపీడితులు చేరి.. చికిత్స పొందుతున్నారు.

     

>
మరిన్ని వార్తలు