22 నుంచి తానా నాటక పోటీలు

13 Dec, 2016 00:19 IST|Sakshi

కర్నూలు (కల్చరల్‌): స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు తానా నాటక పోటీలు నిర్వహించనున్నట్లు నాటక పోటీల కమిటీ చైర్మెన్‌ టీజీ భరత్, లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, తానా కన్వీనర్‌ ముప్పా రాజశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో భాగంగా 22న సాయంత్రం 6 గంటలకు గుంటూరు నాటక సమాజం వారు అనంతం నాటికను, కరీంనగర్‌ చైతన్య కళాభారతి వారు దొంగలు నాటికను ప్రదర్శిస్తారన్నారు. అదే రోజు రాత్రి 8.30 గంటలకు గణేష్‌ ఆర్ట్‌ థియేటర్‌ వారు అంతా భ్రాంతియే అనే నాటికను ప్రదర్శిస్తారన్నారు. 23న సాయంత్రం 6 గంటలకు అభినయ ఆర్ట్స్‌ గుంటూరు వారు రెండునిశ్శబ్దాల మధ్య అనే నాటికను, యంగ్‌ థియేటర్స్‌ అసోసియేషన్‌ విజయవాడ వారు అనగణగా అనే నాటికను రాత్రి 8.30 గంటలకు, సిరిమువ్వా కల్చరల్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ వారు మాతృక నాటికను ప్రదర్శిస్తారన్నారు. 24న శనివారం ఉదయం 10.30 గంటలకు నంద్యాల కళారాధన వారు సైకథ శిల్పం నాటికను, 11.30 గంటలకు కొలకలూరు సాయిఆర్ట్స్‌ క్రియేషన్‌ వారు ఒక్క మాట చాలు అనే నాటికను, 12.30 గంటలకు నిజామాబాద్‌ మురళీకృష్ణ కళానిలయం వారు పొద్దు పొడిచింది అనే నాటికలను ప్రదర్శిస్తారని తెలిపారు. 24న సాయంత్రం టీజీవీ కళాక్షేత్రంలో ప్రముఖ సినీ నటులు బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొంటారన్నారు. కళాభిమానులు ఈ నాటకాలను తిలకించి జయప్రదం చేయాలని లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య కోరారు. 

మరిన్ని వార్తలు