సుచరితకే ఎమ్మెల్సీ టికెట్‌..?

30 Dec, 2016 01:20 IST|Sakshi
సుచరితకే ఎమ్మెల్సీ టికెట్‌..?

ఆమె అభ్యర్థిత్వంపై   అధిష్టానం మొగ్గు
కలిసొచ్చిన బీజేపీ సిఫార్సు
సరేనన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
టీడీపీ అనుబంధ   ఉపాధ్యాయ సంఘంలో వ్యతిరేకత


తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చదలవాడ సుచరిత పేరును టీడీపీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీకి పట్టాభిరామిరెడ్డి పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలను కార్పొరేట్‌ అభ్యర్థులకే కేటాయించడంతో ఆ పార్టీ నాయకుల్లో తీవ్ర అసంచిత్తూరు, సాక్షి: వచ్చే ఏడాది ఆరంభంలో తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి.  తర్జన భర్జనల తరువాత ఉపాధ్యాయ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుచరిత పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే పట్టభద్రుల అభ్యర్థిగా మంత్రి నారాయణ అనుచరుడు పట్టాభిరామిరెడ్డిని ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ అధిష్టానం ఖరారుచేసినట్లు చెబుతున్న అభ్యర్థులపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.  రెండిట్లో ఒక టికెట్‌ కూడా సాధారణ స్థాయిలో ఇవ్వకపోవడంపై కేడర్‌ ఆవేదన చెందుతోంది. కార్పొరేట్లకే పట్టం కట్టడంపై టీడీపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా టికెట్‌ ఆశించి.. వాసుదేవనాయుడు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించుకున్నారు. సుచరిత వైపు మొగ్గుతుండడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఉపాధ్యాయ సమస్యలు విద్యతో వ్యాపారం చేసే కార్పొరేట్లకేం తెలుస్తాయని టీడీపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం నేతలు విమర్శిస్తున్నారు.

స్వతంత్రంగా పోటీకి సన్నద్ధం
టీడీపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం నేతలు స్వతంత్రంగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారని సమాచారం. గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో వేడుకల సందర్భంలో వాసుదేవనాయుడు ముఖ్యమంత్రిని కలిసి టికెట్‌ కేటాయించాలని కోరారని తెలుస్తోంది. ‘బీజేపీ చెప్పిన అభ్యర్థులకు ఇచ్చే అవకాశం ఉంది.. ఈ సారికి ఏమీ అనుకోవద్దు.. పార్టీ కోసం పనిచేయండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇచ్చారని సమాచారం. కార్పొరేట్‌ అభ్యర్థులకు టికెట్‌ ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపుతుండటంతో.. ఉపాధ్యాయ సంఘ నాయకులు స్వతంత్రంగా పోటీచేసేందుకు పావులు కదుపుతున్నారని విశ్వసనీయ సమాచారం. టీడీపీకి, కేంద్రానికి అనుసంధానంగా పనిచేస్తున్న ఓ బీజేపీ నాయకుడి సిఫార్సుతో సుచరితకు టికెట్‌ కేటాయించినట్లు తెలుస్తోంది. చాలా మందితో సంప్రదింపుల అనంతరం.. పోటీ చేయడానికి ఎవరూ మొగ్గు చూపకపోవడంతో సుచరిత పేరునే ఖరారు చేసిందని విశ్వసనీయ సమాచారం. 

>
మరిన్ని వార్తలు