తెలంగాణ జానపద కళల ఖజానా

26 Aug, 2016 01:20 IST|Sakshi
తెలంగాణ జానపద కళల ఖజానా
  • రాష్ట్ర భాషా సాంస్క­ృతికSశాఖ డైరెక్టర్‌ హరికృష్ణ
  • ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు
  •  
    హన్మకొండ కల్చరల్‌ :  తెలంగాణ జానపద కళలకు ఖజానా వంటిదని రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ జానపద కళలకు, కళాకారులకు సముచిత స్థానం కల్పించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, జిల్లా సమాచార పౌర సంబంధాలశాఖ సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర జానపదుల కళాకారుల సంఘం వరంగల్‌ అధ్వర్వంలో గురువా రం ప్రపంచ జానపద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం హన్మకొండ వేయిస్తంభాల దేవాలయం నుంచి 500 మంది కళాకారులు మహార్యాలీ నిర్వహించారు.
     
    అలాగే పలు ప్రదర్శనలు చేపట్టి ఆకట్టుకున్నారు. అనంతరం అంబేద్కర్‌ భవన్‌ సాయంత్రం 7 గంటలకు జరి గిన సమావేశంలో మామిడి హరికృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ కళాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని తెలి పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాౖటెన తర్వాత తెలంగాణ కళలు వికసిస్తున్నాయన్నారు. ప్రపంచమంతటా ఒక రోజు మాత్రమే జానపద దినోత్సవాన్ని జరుపుకుంటుండగా.. తెలంగాణలో పది రోజుల పాటు సంబురాలు జరుపుకోవడం చరిత్రలో మొదటి సారి అన్నారు. నిరాదరణకు గురవుతున్న కళాకారులు, కళాకారుల వాయిద్యాలు మళ్లీ మోగుతున్నాయన్నారు.
     
    వృద్ధ కళాకారులకు పింఛన్, గుర్తింపు, హెల్త్‌ కార్డులు ఇవ్వడంతోపాటు ఇన్సూరెన్స్‌ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మంత్రులు రసమయి బాలకిషన్, అజ్మీరా చందూలాల్, ప్రభుత్వ కార్యదర్శి బుర్ర వెంకటేశం, ప్రభుత్వ సలహాదారు రమణా చారి కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నారన్నారు. సమాచార పౌరసంబంధాలశాఖ డీడీ డీఎస్‌ జగన్‌ మాట్లాడుతూ జిల్లాలో 96 మంది సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారన్నారు. అనంతరం పలువురు కళాకారులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో అడిషనల్‌ జాయింట్‌ కలెక్టర్‌ తిరుపతిరావు, జిల్లా సాంస్కృతిక మండలి సభ్యుడు, జానపద కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు బూర విద్యాసాగర్, అధ్యక్షుడు గడ్డం సుధాకర్, వంగSశ్రీనివాస్, చుంచు లింగయ్య, రాష్ట్ర ప్రతినిధులు సింగారపు జనార్దన్, యాదగిరి ప్రసాద్, అరూరి కుమార్, రామస్వామి, టీఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ దారా దేవేందర్, కవి అన్వర్, సినీ దర్శకుడు సంగ కుమార్, మేజిషియన్‌ మార్త రవి, మిమిక్రీ కళాకారులు మనోజ్‌కుమార్, ఆలేటి శ్యామ్,  వరంగల్‌ శ్రీనివాస్, తదితరలు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు