టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి

23 Jun, 2016 09:13 IST|Sakshi
టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి

జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి
జిల్లాల విభజనపై ఉన్న శ్రద్ద  రైతులపై ఏదీ?
రుణమాఫీ నిధులు, ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయాలి
►  కలెక్టరేట్ ఎదుట  వైఎస్సార్‌సీపీ ఆందోళన

 
 
జగిత్యాల అర్బన్ : తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి అన్నారు. సీఎం  కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఒక కరీంనగర్ జిల్లాలోనే రూ.10 వేల కోట్ల పనులు జరుగుతున్నాయంటే ప్రభుత్వ పనితీరు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన జగిత్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల్లోనే నీళ్లు, నిధులు, నియూమకాలపై దృష్టి పెట్టిందన్నారు. బీజేపీ నాయకులు తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా.. రాష్ట్ర సర్కారు రైతులకు ఇవ్వడం లేదనడం సమంజసం కాదన్నారు. తెలంగాణకు నిధులు కావాలని ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి బృందం వెళ్లి అడుగగా కేంద్రం పెద్దగా పట్టించుకోలేదన్నారు.

అయినప్పటికీ రాష్ట్రంలో రైతులకు పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారాన్ని, రుణమాఫీని ప్రభుత్వం అందజేసిందన్నారు. హైకోర్టు విభజన కోసం న్యాయవాదులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్, నాయకులు ముప్పాల రాంచందర్‌రావు, సత్యనారాయణరావు, రవీందర్‌రెడ్డి, దేవేందర్‌నాయక్, గుగ్గిళ్ల హరీశ్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు