పవన్ వెనుక ఎవరున్నారో బయటపెడతాం: రఘువీరా

19 Mar, 2014 01:16 IST|Sakshi
పవన్ వెనుక ఎవరున్నారో బయటపెడతాం: రఘువీరా

సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి చిరంజీవి సోదరుడు, నటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించడం, ఆయన కాంగ్రెస్ వ్యతిరేక వైఖరిని ఎంచుకోవడం వెనుక ఎవరున్నారనేదీ త్వరలోనే బయటపెడతామని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. పవన్ కల్యాణే కాదు కాంగ్రెస్ ను వ్యతిరేకించే వారంతా తమకు ప్రత్యర్థులేనని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇంది రాభవన్‌లో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆనం రామనారాయణరెడ్డి, మాజీ మంత్రి సి.రామచంద్రయ్యలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భం గా జనసేన ప్రస్తావన వచ్చినప్పుడు రఘువీరా పక్కనే కూర్చున్న చిరంజీవి ఒకింత అసహనానికి గురయ్యారు.
 
 ఆయన మాట్లాడకపోవడంతో రఘువీరారెడ్డే స్పందిస్తూ ‘‘కాంగ్రెస్‌ను కాదనే వారు ఎవరైనా మాకు సమాన దూరమే. పనిగ టు ్టకొని తప్పుడు విమర్శలు చేస్తే వాటి బ్యాక్  గ్రౌండ్ ఏమిటనేది బయటపెడతాం. ఎవరు ఎవరితో ఒప్పం దాలు కుదుర్చుకుంటున్నారు? ఎవరు కుమ్మక్కవుతున్నారో అన్నీ బయట పెడతాం’’ అని చెప్పారు. జనసేన వల్ల కాంగ్రెస్‌కు ఇబ్బంది లేదన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తు, వాటికి జనసేన మద్దతు గురించి వస్తున్న వార్తలను విలేకరులు ప్రస్తావించ గా ‘‘టీడీపీ, బీజీపీయే కాదు అన్ని పార్టీలు కలసినా కాంగ్రెస్‌కు ఏమీ కాదు. టీడీపీ, బీజేపీ, వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన ఇవన్నీ ఏకమైనా మాకు ఏమీకాదు. ఎన్నికలను ఎదుర్కొనడం మాకు కొత్త కాదు’’ అని సమాధానమిచ్చా రు. పార్టీ నుంచి సీనియర్ నేతలు వెళ్లిపోయినా కార్యకర్తలు ఉన్నారని, వారితోనే పార్టీని పునర్నిర్మిస్తామని రఘువీరా ధీమా వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు