ఒకప్పుడు చెడ్డవి... ఇప్పుడు అవే మంచివి!

3 Apr, 2016 23:23 IST|Sakshi
ఒకప్పుడు చెడ్డవి... ఇప్పుడు అవే మంచివి!

తిండి గోల

 
ఒకప్పుడు ఆ పదార్థాలను కాస్త ప్రతికూలమైనవిగా పరిగణించేవారు. తిన్నా పరిమితి పాటించమంటూ పెద్దలు సుద్దులు చెప్పేవారు. ఆరోగ్యనియమాలు పాటించేవారైతే వాటిని చాలా దూరంగా ఉంచేవారు కూడా. అవే... గుడ్లు, ఆలూ (బంగాళాదుంప). ఇప్పుడు ఆహార నిపుణులంతా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం గుడ్లు, ఆలుగడ్డ (బంగాళదుంప)లను విరివిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకనాడు హెల్త్ పాలిటి విలన్‌లుగా పరిగణించిన పదార్థాలనే మళ్లీ హీరోలను చేస్తున్నారు.

 
లండన్‌లోని ప్రతిష్ఠాత్మకమైన కింగ్స్ కాలేజ్‌లో స్కాట్ హెర్డింగ్ అనే నిపుణుడు ‘ద కన్వర్సేషన్’ అనే జర్నల్ కోసం రాసిన పరిశోధన పత్రంలోని ముఖ్య అంశాలపై ప్రసంగించారు. అందులోని కొన్ని ప్రధానాంశాలివి... ఒకప్పుడు ఒక గుడ్డులో కనీసం 185 ఎంజీ కొలెస్ట్రాల్ ఉంటుందనీ, గుండెకు అదెంతో కీడు అని చెప్పేవారు. అయితే గత 20 ఏళ్ల వ్యవధిలో జరిగిన వైద్యపరిశోధనల ప్రకారం క్రమం తప్పకుండా గుడ్లు తినేవారి కొలెస్ట్రాల్ పాళ్లు క్రమబద్ధంగా ఉంటాయని పేర్కొంటున్నారట. గుడ్లు తినకపోవడం వల్ల కోల్పోయే  మినరల్స్, విటమిన్స్ ఎక్కువన్నది పరిశోధకుల తాజా మాట.

    
ఆలుగడ్డ (బంగాళదుంప)లను చాలా అనారోగ్యకరమైనవిగా ఇటీవలి వరకూ పరిగణిస్తూ వస్తున్నారు. వాటిలో చక్కెరను పెంచే గుణం ఉన్నందున వాటిని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఆహార పదార్థాలుగా చెబుతూ వీలైనంత తక్కువగా వాడాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే వాటిల్లో కార్బోహైడ్రేట్లతో పాటు, విటమిన్-సి, కొన్ని రకాల విటమిన్-బిలు, కొన్ని ఖనిజాలూ ఉన్నాయనీ, ఆరోగ్యానికి అవి అవసరమంటూ ఇప్పుడు ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. పైగా ఆలుగడ్డలను మనం ఎలా వండుకుంటామన్న అంశమే అనారోగ్యకరం తప్ప అవి అనారోగ్య కారకాలు కావంటూ ఆహార నిపుణులు కితాబిస్తున్నారు. మన జీర్ణవ్యవస్థలో నివాసం ఉండే మనకు మేలు చేసే బ్యాక్టీరియా విషయంలోనూ బంగాళదుంపతో సానుకూలం ప్రభావం ఉంటుందంటున్నారు స్కాట్ హెర్డింగ్.

 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆరోగ్య ‘సిరి’ధాన్యాలు

ఒకేలా కనిపిస్తారు.. ఒకేలా అనిపిస్తారు

షూటింగ్‌లో అలా చూస్తే ఫీలవుతాను

ఇదీ భారతం

మూర్ఛకు చెక్‌ పెట్టే కొత్తిమీర!

మంచి నిద్రకు... తలార స్నానం!

నేత్రదానం చేయాలనుకుంటున్నా...

హలో... మీ అమ్మాయి నా దగ్గరుంది

రియల్‌ లైఫ్‌ లేడీ సింగం

కోటల కంటే ఇల్లే కష్టం

గర్భవతులకు నడక మంచి వ్యాయామం!

ఇక ద్రవాలూ అయస్కాంతాలే!

కీళ్ల కదలికలతోనూ విద్యుత్తు...

అమ్మాయికి మొటిమలు వస్తున్నాయి..?

వెనిస్‌ వాకిట్లో బాంబే రోజ్‌

కొత్త గర్ల్‌ ఫ్రెండ్‌... కొత్త బాయ్‌ఫ్రెండ్‌

‘జంకు’.. గొంకూ వద్దు!

హాహా హూహూ ఎవరో తెలుసా?

కడుపులో కందిరీగలున్న  స్త్రీలు

ఖాళీ చేసిన మూల

మెరిసే చర్మం కోసం..

బరువును సులువుగా తగ్గించే చనాచాట్‌

రుచుల్లో "మున"గండి...

కొవ్వుకణాలతో కేన్సర్‌కు మందులు

సింగపూర్‌లో శాకాహార హోటల్‌

సరయు : డాన్స్‌, ఫైట్స్‌, ఆర్ట్స్‌

హాలీవుడ్‌కి రష్యన్‌ పేరడీ!

శిక్ష ‘ఆటో’మాటిక్‌

మహిళా ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌పై దుమారం

గుండెజబ్బును సూచించే రక్తపోటు అంకెలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’