అందమె ఆనందం

25 Mar, 2015 22:44 IST|Sakshi
అందమె ఆనందం

వేసవిలో చెమట పట్టి ముఖం మురికిగా, జిడ్డుగా అయిపోతుంటుంది కదా! అలాంటప్పుడు కీర దోసకాయను మెత్తని గుజ్జులా రుబ్బుకుని, అందులో కాసింత నిమ్మరసం, ఓ గుడ్డు తెల్లసొన కలిపి ప్యాక్ వేసుకుని... బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే జిడ్డు, మురికి పోయి ముఖం కాంతివంతమవుతుంది!
     
క్యాబేజీని మెత్తగా రుబ్బి రసం తీయాలి. ఈ రసంలో కొంచెం శనగపిండి, తేనె కలిపి ముఖానికి పట్టించి, అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. తరచు ఇలా చేస్తూ ఉంటే మొటిమలు, మచ్చలు తగ్గడంతో పాటు పొడిదనం పోయి చర్మం తేమగా నిగనిగలాడుతూ ఉంటుంది!
 
 

మరిన్ని వార్తలు