కళ్ల కింద నల్లటి వలయాలుంటే...

19 Jun, 2018 00:21 IST|Sakshi

బ్యూటిప్స్‌

ముఖానికి అప్లయ్‌ చేసిన క్రీములను అలాగే వదిలేయడం వల్ల క్రమంగా కళ్ల కింద చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి కమిలి సహజత్వాన్ని కోల్పోతుంది. మేకప్‌ కోసం వాడిన క్రీములను శుభ్రం చేసేటప్పుడు కళ్ల కింద జాగ్రత్తగా తుడవాలి, వెంటనే బేబీఆయిల్‌ వంటివి రాయాలి.పలుచగా కోసిన బంగాళదుంప లేదా కీరదోస ముక్కలను కళ్లు మూసుకుని రెప్పలమీద పెట్టి పదిహేను నిమిషాల పాటు ఉంచాలి. ముక్కలను తీసిన తర్వాత చన్నీటితో ముఖం కడిగి కళ్ల కింద నరిషింగ్‌ క్రీమ్‌. రాయాలి. 
 
బంగాళదుంప రసం, కీరదోస రసం సమపాళ్లలో తీసుకుని ఆ మిశ్రమంలో ముంచిన దూదిని కళ్ల మీద పెట్టి ఇరవై నిమిషాల సేపు ఉంచాలి. కాటన్‌ పాడ్స్‌ తీసిన తర్వాత చన్నీటితో కడగాలి.తాజా నిమ్మరసంలో అంతే మోతాదు టొమాటో రసం కలిపి ఆ మిశ్రమంలోముంచిన దూదిని కళ్ల మీద పెట్టాలి. ఇలారోజుకు రెండుసార్లు చేయాలి.స్వచ్ఛమైన పసుపులో పైనాపిల్‌ రసం కలిపిఆ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ రాసి ఆరినతర్వాత చన్నీటితో కడగాలి. పుదీనా ఆకులను చిదిమి రసాన్ని కళ్ల చుట్టూరాస్తున్నా కూడా వలయాలు పోతాయి. 
 

మరిన్ని వార్తలు