డ్యాన్స్‌ చేస్తే తెలివి పెరుగుతుంది

6 Feb, 2018 00:34 IST|Sakshi
సల్సా డ్యాన్స్‌

అధ్యయనం 

తెలివితేటలు పెరగాలంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా కాసేపే డ్యాన్స్‌ చేస్తే చాలంటున్నారు శాస్త్రవేత్తలు. డ్యాన్స్‌ చేస్తే మెదడు చురుకుగా మారి, తెలివితేటలు పెరుగుతాయని బ్రిటన్‌లోని కొవెంట్రీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొందరు విద్యార్థులపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ శాస్త్రవేత్తలు పలు ఆసక్తికరమైన విశేషాలను కనుగొన్నారు.

వారానికి ఒక సల్సా డ్యాన్స్‌ క్లాస్‌కు హాజరైన వారిలో విషయాలను ఆకళింపు చేసుకునే శక్తి 8 శాతం, ఏకాగ్రత 13 శాతం, జ్ఞాపకశక్తి 18 శాతం పెరిగినట్లు తమ పరిశోధనలో తేలిందని కొవెంట్రీ వర్సిటీ శాస్త్రవేత్త మైకేల్‌ డంకన్‌ చెబుతున్నారు. కేవలం సల్సా అనే కాదని, ఎలాంటి నాట్యమైనా ఏకాగ్రతను గణనీయం పెంచుతుందని ఆయన అంటున్నారు. ఇక ఆలస్యమెందుకు... మెదడు మందకొడిగా మారిందనిపిస్తే మరింకేమీ ఆలోచించకుండా మంచి మ్యూజిక్‌ పెట్టుకుని కాసేపు ఒళ్లు అలసిపోయేలా స్టెప్పులెయ్యండి చాలు. 

>
మరిన్ని వార్తలు