రారండోయ్‌

12 Mar, 2018 03:29 IST|Sakshi

‘కథా రచన: ఒక్కరోజు కార్యశాల’ మార్చి 14న ఉ. 10 నుండి తెలంగాణ విశ్వవిద్యాలయం, డిచ్‌పల్లి, నిజామాబాద్‌లో జరగనుంది. నిర్వహణ: తెలంగాణ సాహిత్య అకాడమీతో కలిసి విశ్వవిద్యాలయ తెలుగు శాఖ.

ఆచార్య పి.నరసింహారెడ్డి రాసిన సాహిత్య అకాడమీ ప్రచురణ ‘అచార్య జి.ఎన్‌.రెడ్డి’ గ్రంథావిష్కరణ సభ మార్చి 15న ఉదయం 10:30కు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ ఆర్ట్స్‌ బ్లాక్‌ ఆడిటోరియంలో జరగనుంది. నిర్వహణ: విశ్వవిద్యాలయ తెలుగు శాఖ.

నాగరాజు రామస్వామి మూడు గ్రంథాల– ‘సూర్యశిల’, ‘ఎద పదనిసలు’, ‘అనుస్వనం’– ఆవిష్కరణ, అంకితోత్సవం సభ మార్చి 16న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరగనుంది.

కటుకోఝ్వల రమేశ్‌ కవితాసంపుటి ‘అగ్నిశిఖ’ ఆవిష్కరణ మార్చి 17న సాయంత్రం 5 గంటలకు సీఈఆర్‌ క్లబ్, ఇల్లందులో జరగనుంది. నిర్వహణ: తెలంగాణ సాహితి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

కవిసంధ్య, డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.కె. ఆర్ట్స్‌ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 21న యానాంలో ‘ప్రపంచ కవితా దినోత్సవం’ జరగనుంది.

‘తెలంగాణ వచన కవితా వికాసం’ అంశంపై రెండ్రోజుల జాతీయ సదస్సును మార్చి 22, 23 తేదీల్లో తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, సుబేదారి, హనుమకొండ, కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. సంచాలకులు: ప్రొఫెసర్‌ బన్న అయిలయ్య.

మరిన్ని వార్తలు