ఆకుకూరలు దివ్యౌషధాలు

11 Aug, 2018 00:21 IST|Sakshi

ఆకు కూరలు రకరకాలు. ఒకే ఆకు కూరను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఉదాహణకు... గోంగూరనే పుంటి కూర  అని కూడా అంటారు. పేరును బట్టి పోల్చకపోయినా, ఆకుల్ని కంటితో చూస్తే, ‘ఓహో’ ఇదేనా! అనిపిస్తుంది. ఒకే ఆకు కూరలో చిన్న చిన్న అంతర్భేదాలు కూడా ఉండొచ్చు. ఉదా: చిన్న మెంతి, పెద్ద మెంతి, గోంగూర – తెలుపు/ఎరుపు. ఆకు కూరలన్నింటిలోనూ ఎంతో కొంత పోషక విలువలు ఉంటాయి. చాలా వాటిలో ఔషధ విలువలు కూడా నిక్షిప్తమై ఉంటాయి. ప్రాంతీయపు అలవాట్లను బట్టి కొన్ని ఆకు కూరలను నిత్యం ఆహారంలో తింటుంటాం. కొన్నింటిని అవసరాన్ని బట్టి ఔషధాలుగా మాత్రమే వినియోగిస్తాం. సామాజిక స్పృహతో సక్రమ ప్రచారం చే స్తే, పోషకానికైనా, ఔషధానికైనా ఇవి పేదలపాలిట వరప్రసాదాలని చెప్పక తప్పదు.

1. మత్సా్యక్షి (పొన్నగంటి కూర)
మేధ్య రసాయనం (మెదడుకి బలం), నేత్య్రం (కంటికి మంచిది). ‘‘కుమారాణాం వపుర్మేధా బలబుద్ధి వివర్ధనాః’’ అన్నాడు సుశ్రుతాచార్యుడు.

2. మూషిక (ఆజ) పర్ణి 
(ఎలుక చెవి కూర)
జ్వరాలకు, కడుపులోని నులి పురుగులకు మంచిది. దీని మొత్తం మొక్క కషాయంగా గాని, ఆకుల పసరుగా గాని సేవించవచ్చు. దీని వేరును స్త్రీ గర్భకోశ రోగాలలో వాడతారు.

3. అపామార్గ (ఉత్తరేణు)
పైల్స్, అజీర్ణం, చర్మ రోగాలు, విరేచనాలు, మూత్ర విసర్జనలో మంట మరియు క్లిష్టత, స్త్రీలలో తెల్ల బట్ట, నిద్ర లేమి, జంతువుల విష రోగాలు మొదలగు వాటిలో చక్కటి గుణకారి. అపామార్గ క్షారం క్లిష్టమైన వ్రణాలను మాన్పుతుంది. అపామార్గపు ‘వేరు’ ను యోనిలో ఉంచితే స్త్రీలలో కష్ట ప్రసవం జరగకుండా సుఖ ప్రసవమౌతుంది. వేరును దంచి ముద్దగా చేసి ప్రసవ సమయంలో ఉదర, జననాంగాల వెలుపల లేపనం చేసినా సుఖప్రసవమౌతుంది.‘‘అపామార్గ శిఫాం యోని మధ్యే నిక్షిప్య ధారయేత్‌ సుఖం ప్రసూయతే నారీ భేషజస్యాస్య యోగతః’’

గమనిక: అకాలంలో మొలిచినవి, దూషితమైనవి, పాతవిౖయెనవి తినరాదు. పాత. లూత. దూష్య, పరువంబు కానట్టి కలుష ధరణియందు మొలచినట్టి అపరిశుభ్రమైన ఆకుకూరలెపుడు తినగవలదు సుమ్మి! మనగ నరుడ!
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు

మీ వంటలకు ఆహ్వానం
మీరూ గొప్ప చెఫ్‌ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారు చేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్‌... ఎవరైనా వంట చేసి లొట్టలేయిం చవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్‌కమ్‌. mail: familyvantakalu@ gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. 
మా చిరునామా:  సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, 
సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్,

మరిన్ని వార్తలు