పగటివేళ గుండెపోటు ప్రమాదం

3 Jul, 2019 13:00 IST|Sakshi

స్విట్జర్లాండ్‌: సాధారణంగా ఏ వ్యక్తికి అయినా గుండెపోటు అంటేనే ప్రమాదకరం. అయితే, పగటి వేళల్లో వచ్చే గుండెపోటు అత్యంత ప్రమాదకరమని అంటున్నారు స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ జనీవా శాస్త్రవేత్తలు. గుండెపోటు సాధారణంగా పగటి వేళల్లోనే ఎక్కువగా వస్తుందని, అయితే, రాత్రి వేళలో వచ్చే గుండె పోటు కంటే ఇది ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ మేరకు తమ అధ్యయన వివరాలను ‘ట్రెండ్స్‌ ఇన్‌ ఇమ్యునాలజీ’జర్నల్‌లో ప్రచురించినట్టు తెలిపారు. చుంచులపై చేసిన ప్రయోగ వివరాలను పేర్కొన్నారు. చుంచులు, మానవుల్లో తెల్ల రక్త కణాలు సిర్కాడియన్‌ పద్ధతిలో ఊగిసలాడుతూ ఉంటాయని, రోగనిరోధక శక్తిని ఆప్టిమైజ్‌ చేసేందుకు ఒక రోజు సమయం పడుతుందని తెలిపారు. అదే సమయంలో పగటి వేళల్లో రోగనిరోధక కణాల రిథమ్‌ సాధారణం కన్నా తక్కువస్థాయిలో ఉంటాయని, దీనివల్ల పగటి వేళల్లో సంభవించే గుండెపోటును నియంత్రించడం కష్టతరమని శాస్త్రవేత్తలు వివరించారు. 

మరిన్ని వార్తలు