కిచెన్‌ టిప్స్‌

30 Jun, 2018 02:56 IST|Sakshi

అగరువత్తుల నుసితో ఇత్తడి పాత్రలు కడిగితే పాత్రలు తళతళ మెరుస్తాయి.
 కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే, పెరుగు తొందరగా పాడవ్వదు.
♦  పసుపు కలిపిన నీటితో వంట గదిని శుభ్రం చేస్తే ఈగలు ముసరకుండా ఉంటుంది.
 పప్పును ఉడికించేటప్పుడు నూనె వేస్తే పప్పు త్వరగా ఉడుకుతుంది.
 కందిపప్పు డబ్బాలో ఎండు కొబ్బరి చిప్ప ఉంచితే, పప్పు పాడవ్వదు.
 ఇంగువ నిల్వ చేసే డబ్బాలో పచ్చి మిరపకాయ వేస్తే ఇంగువ తాజాగా ఉంటుంది.
 వెల్లుల్లిపాయలను మెత్తగా దంచి, కొద్దిగా నీళ్లల్లో కలిపి, బొద్దింకలు వచ్చే చోట ఉంచితే, బొద్దింకలు ఆ ప్రాంతానికి రావు.
 కాకరకాయ ముక్కలకు కొంచెం ఉప్పు రాసి, నీళ్లు చల్లి గంటసేపు ఉంచితే కాకరకాయల చేదు పోతుంది.

మరిన్ని వార్తలు