వీరమాతకు లింకన్ లేఖ

20 Nov, 2015 23:40 IST|Sakshi
అంతర్యుద్ధ సమయంలో అబ్రహం లింకన్

ఆ  నేడు 21 నవంబర్ 1864
 

అమెరికాలో 1861 నుంచి 1865 వరకు అంతర్యుద్ధం జరిగింది. 1861 జనవరిలో అప్పటికి ఉన్న 34 అమెరికన్ రాష్ట్రాలలో ఏడు బానిస రాష్ట్రాలు  తమను తాము స్వతంత్రమైనవిగా ప్రకటించుకుని, మిగతా రాష్ట్రాల నుంచి విడిపోయి ‘కాన్ఫెడరసీ’గా ఏర్పడ్డాయి. ఈ గ్రూపును ‘సౌత్’ అని పిలిచేవారు. తక్కిన రాష్ట్రాలు బానిసత్వాన్ని వ్యతిరేకించే ‘యూనియన్’గా ఉండిపోయాయి. వీటిని ‘నార్త్’ అని పిలిచేవారు. బానిసత్వ వ్యవస్థను మిగతా రాష్ట్రాలకు కూడా విస్తరింపజేయాలన్న ‘సౌత్’ డిమాండుతో మొదలైన అమెరికా అంతర్యుద్ధంలో సౌత్, నార్త్ గ్రూపులకు చెందిన 6 లక్షల మంది సైనికులు మరణించారు.

ఆ సమయంలో అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షునిగా ఉన్నారు. యుద్ధ మరణాలు ఆయన్ని కలచివేశాయి. ఆ పశ్చాత్తాపంతో ఆయన... అంతర్యుద్ధంలో తన నలుగురు కొడుకులను కోల్పోయిన లిడియా బిక్స్‌బై అనే మహిళకు 1864 నవంబర్ 21న క్షమాపణ లేఖ రాశారు. అబ్రహం లింకన్ సంతకంతో ఉన్న ఆ ఉత్తరం నవంబర్ 25న ‘బోస్టన్ ఈవెనింగ్ ట్రాన్‌స్క్రిప్ట్’ పత్రికలో అచ్చయింది. అయితే అది నిజంగా లింకన్ రాసిన ఉత్తరమేనా అనే సందేహాలు ఇప్పటికీ ఉన్నాయని చరిత్రకారులు అంటారు.

మరిన్ని వార్తలు