వీరే మావారు

13 Jun, 2020 08:42 IST|Sakshi
భర్తతో మోనాలి

గాయని మోనాలీ ఠాకూర్‌ అధాటున తన పెళ్లి విషయం బయట పెట్టేశారు. పెళ్లి చేసుకోబోతున్నట్లు కాదు. మూడేళ్ల క్రితమే పెళ్లి చేసేసుకున్నట్లు! స్విట్జర్లాండ్‌ వెళ్లినప్పుడు అక్కడ తనతో ప్రేమలో పడిన మైక్‌ రిచ్టర్‌నే పెళ్లి చేసుకున్నారట మోనాలి. భార్యా భర్త ప్రస్తుతం స్విట్జర్లాండ్‌ లోనే ఉన్నారు. మోనాలి అక్కడినుంచే తన తాజా సింగిల్‌ వీడియో ‘దిల్‌ కా ఫితూర్‌’తో పాటు తన పెళ్లి రహస్యాన్ని కూడా రిలీజ్‌ చేశారు. ‘సవార్‌ లూ..’ (లూటేరా), ‘మోహ్‌ మోహ్‌ కె ధాగే’ (దమ్‌ లగాకే హైసా) పాటలతో అమృతం కుమ్మరించిన మోనాలి.. భర్తతో కలిసి ఇండియా రాగానే మొదట చేయబోతున్న పని మళ్లీ ఇక్కడ పెళ్లిని రీ–ప్లే చేయడం.

మరిన్ని వార్తలు