డెనిమిజమ్

2 Dec, 2015 23:07 IST|Sakshi
డెనిమిజమ్

వేడుకలో హైలైట్‌గా నిలవాలని ఎప్పుడూ ఓ కొత్త వేషధారణను ఎంచుకునేవారుంటారు. ఈ కాలానికి తగ్గట్టుగా నెటెడ్, బెనారస్, పట్టులతో ఎన్నో వేల డిజైన్లు పుట్టుకొస్తున్నాయి. అయితే, ఈ కాలం ఆధునికంగా మెరవాలన్నా, సంప్రదాయంగా కళగా ఉండాలన్నా కుదరదు అని చలికి వణుకుతూ విసుక్కుంటారు. స్వెటర్ ధరిస్తే డ్రెస్ అందం పడిపోతుందని దిగులుపడుతుంటారు. చలికాలం ఈ సమస్య ఎదురుకాకుండా ‘డెనిమ్’ని కొత్తగా ధరించవచ్చు. స్టైల్‌గా వెలిగిపోవచ్చు.
 
డెనిమ్ ప్యాంట్స్, జాకెట్స్ వరకే పరిమితం కాలేదు. ఇంకాస్త మోడ్రన్ కోరుకునేవారు షార్ట్, లాంగ్ గౌన్స్, షర్ట్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. సంప్రదాయాన్ని ఇష్టపడేవారు లెహంగాలు, చుడీదార్లు, అనార్కలీ ఫ్రాక్‌లను ధరించవచ్చు. డెనిమ్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. ఒకే రంగులోనే లైట్, డార్క్‌లతో చూపు తిప్పుకోనివ్వని డెనిమ్‌ని మరింత ఆకర్షణీయంగా రూపుకట్టవచ్చు అని నిరూపిస్తున్నారు నేటి డిజైనర్లు.

డెనిమ్ ఒకటే.. వేల రూపాలు...
 ప్యాంటులు, స్కర్టులు, డ్రస్సులు, జాకెట్స్, షర్టులు, షార్ట్‌లు, సాక్స్, షూ, బ్యాగులు, టోపీలు.. ఇలా ఎన్నింటినో తయారు చేస్తున్నారు. డెనిమ్ క్లాత్‌తో డిజైనర్స్ ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. చలికాలానికి స్టైల్‌గా, కంఫర్ట్‌గా అనిపించే డెనిమ్ ఇప్పుడు చూడచక్కగా కనుల ముందు నిలుస్తోంది. చలి నుంచి రక్షిస్తుంది. వాతావరణం వేడగా ఉన్నా పొట్టి పొట్టి డెనిమ్ దుస్తులు ధరించవచ్చు. అందుకే ప్రపంచమంతా కొన్నేళ్లుగా డెనిమ్ హల్‌చల్ చేస్తోంది. వరల్డ్ క్లాత్‌గా పేరుపడిపోయిన డెనిమ్‌తో విభిన్నమైన డిజైన్లు సృష్టించండి. ఇక వెచ్చగా మెరిసిపోండి.
 - ఎన్.ఆర్
 
డెనిమ్‌ను ఫ్రాన్స్ దేశంలో నిమెస్, ఆండ్రే కుటుంబం తయారుచేశారు. దీనినే సిర్గే డె నిమెస్ అనిపిలుస్తారు. ఈ పేరును ‘డెనిమ్’ అని సంక్షిప్తం చేశారు. ఇది గట్టిగా ఉండే కాటన్ వస్త్రం. దీంట్లో సాధారణంగా నీలిరంగు అద్దకం ఎక్కువ. ప్రస్తుతం అంతా వాడే జీన్స్ అనే పదం ఇటలీలోని జెనెస్ పదం నుండి  వచ్చింది. మొదటి డెనిమ్ ప్యాంటులను ఇటలీలోనే తయారుచేసేవారు. డెనిమ్‌లో పొడి డెనిమ్, అంచు డెనిమ్, సాగే డెనిమ్, కలర్ డెనిమ్.. అంటూ విభిన్న రకాలు ఉన్నాయి.
 
మరిన్ని వార్తలు