సొంత చేయి పరాయిదైతే?!

18 Jan, 2016 23:52 IST|Sakshi
సొంత చేయి పరాయిదైతే?!

మెడిక్షనరీ
చేయి తనదే... కానీ చేష్ట మాత్రం తనది కాదు. తాను చేస్తున్న పని తాను అనుకున్నది  కాదు. అలా చేయడం కూడా ఇష్టం లేదు. అయినా తన చేతిపైన తనకే నియంత్రణ ఉండదు. ఈ లక్షణాలు తెలుసుకుంటే కాస్త విచిత్రంగా అనిపిస్తోందా? అయినా ఇది వాస్తవం. ఇది నరాలకు సంబంధించిన ఒక జబ్బు. కాస్తంత అరుదుగా కనిపిస్తుంది. ఇది వచ్చిన వారు తమ చేయి తమ ఒంటిలో భాగంలా అనిపించడం లేదని ఫీలవుతుంటారు. ఈ రుగ్మత పేరు ‘ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్’.

ఈ జబ్బు వచ్చిన వారు తమ చేతిని మరెవరో  నియంత్రిస్తున్నారనీ అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో పక్షవాతం వచ్చినవారిలోనూ, మెదడుకు శస్త్రచికిత్స అయిన వారిలోనూ, ఇన్ఫెక్షన్ వచ్చినవారిలో ఇది కనిపిస్తుంది. ఒక మహిళా పేషెంట్‌లో ఈ వ్యాధిని కనుగొన్న డాక్టర్ కర్ట్ గోల్డ్‌స్టెయిన్ అనే సైకియాట్రిస్ట్ దీన్ని మొదటిసారి దీన్ని నమోదు చేశారు. దీనికి నిర్దిష్టమైన చికిత్స ఏదీ లేకపోయినా... చాలామందిలో దానంతట అదే తగ్గుతుంది.

మరిన్ని వార్తలు