పైల్స్ - హోమియో చికిత్స

25 Dec, 2013 22:57 IST|Sakshi
పైల్స్ - హోమియో చికిత్స

పైల్స్ వున్న వారి బాధ వర్ణనాతీతం. మలవిసర్జన తర్వాత ఈ బాధ కొన్ని గంటల వరకు ఉంటుంది. నొప్పి, మంట, దురద ఉండి, సూదులతో గుచ్చుకున్నట్లు వుండి వీరు ఒకచోట కూర్చోలేరు, నిల్చోలేరు. ఈ మొలలు చిట్లడం వలన రక్తస్రావం జరుగుతుంది. చాలారోజుల వరకు రక్తస్రావం అయితే శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గి ఎనీమియా రావడానికి ఆస్కారం ఉంది. జీవన విధానం, మారుతున్న ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి, వాహనాలు అధికంగా నడపడం, వేసవికాలం, నీరు అధికంగా తీసుకోకపోవడం వలన ఇవి వస్తాయి.
 
 మలద్వారంతో కలుపబడిన పెద్ద పేగు చివరి భాగాన్ని మలనాళం లేదా రెక్టమ్ అంటారు. ఇక్కడ ఉన్న కణజాలంలో అధికంగా ఉండే రక్తనాళాల వాపు వలన ఈ స్థితి వస్తుంది. పురీష నాళం వెలుపలి భాగంలో వస్తే బాహ్య హెమరాయిడ్స్ అని, లోపలి భాగంలో వస్తే  లోపలి హెమరాయిడ్స్ అని అంటారు. ఇవి బఠాణీ గింజ లేదా ద్రాక్షపండు పరిమాణంలో గులాబీ రంగులో, మూడు లేదా నాలుగు గుత్తులుగా లేదా విడిగా కూడా ఉండే ఈ స్థితిని మూలశంక (పైల్స్) వ్యాధిగా పేర్కొంటారు.
 
 ఎవరికి వస్తుంది..? ... గర్భిణులలో, ప్రోస్టేట్ గ్రంథి వాపు ఉన్నవారిలో సాధారణంగా చూస్తాం. పిల్లలలో ఈ వ్యాధిని అరుదుగా చూస్తాం.
 
 కారణాలు...  
 మలబద్దకం మూలంగా అధికంగా ముక్కుటం
 దీర్ఘకాలిక విరేచనాలు  
 గర్భస్థ పిండం ఒత్తిడి వలన, అధికంగా ఉత్పత్తి అయ్యే హార్మోన్ల వలన   
 పొత్తికడుపు లేదా పేగులలోని క్యాన్సర్ సంబంధ కణుతుల వలన  
 వంశపారంపర్యంగా  
 అధిక బరువు, స్థూలకాయం  
 హెమరాయిడ్‌లు, వేరికోస్ సిరల వ్యాధి ఉన్నవారిలో  
 పీచు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని రోజూ తీసుకోవడం... వంటివి.
 
 హెమరాయిడ్‌లు - రకములు...
 మొదటి తరగతి (ఫస్ట్ డిగ్రీ పైల్స్): రెక్టమ్ లేదా మలనాళం లోపలే ఉంటాయి; రెండవ తరగతి (సెకండ్ డిగ్రీ పైల్స్): పురీషనాళం తెరచుకుని ఉన్నప్పుడు వెలుపలికి వచ్చి, మలద్వారం మూసుకున్న వెంటనే లోపలికి వెళ్లిపోతాయి; మూడవ తరగతి (థర్డ్ డిగ్రీ పైల్స్): వెలుపలికి వచ్చి, హెమరాయిడ్‌లను లోపలికి చొప్పించిన వెంటనే లోనికి వెళ్లిపోతాయి; నాల్గవ తరగతి (ఫోర్త్ డిగ్రీ పైల్స్): మలద్వారం వెలుపల శాశ్వతంగా వేలాడుతూ ఉంటాయి.
 
 లక్షణాలు: చాలామంది ఎక్కువగా లోపలి హెమరాయిడ్‌ల (ఇంటర్నల్ పైల్స్)తో ఏ లక్షణాలూ లేకుండానే ఉంటారు. మలద్వారం తెరచుకున్న వెంటనే తాజా రక్తం మలద్వారం ద్వారా వెలుపలికి వస్తుంది. మలద్వారం చుట్టూ దురద ఉండవచ్చు. మూడు-నాలుగు దశలలోని హెమరాయిడ్‌లు, అధికంగా నొప్పి ఉండి చీము వంటి పలుచని ద్రవం విసర్జింపబడుతుంది.
 
 నివారించవచ్చా?
 
 మొలలు వచ్చిన తరువాత కంటె మొలల లక్షణాలు కనబడిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చు. మొలలతో బాధపడేవారు ఆహారపు అలవాట్లలో, జీవన విధానంలో మార్పు తీసుకొస్తే నివారించవచ్చు. ముఖ్యంగా తాజా పండ్లు, ఆకుకూరలు, ఫైబర్‌తో కూడిన పదార్థాలు, దప్పిక ఉన్నా లేకున్నా పది నుండి పన్నెండు గ్లాసుల నీరు తీసుకోవడం, మాంసాహారం, మసాలాలు, పచ్చళ్లు తీసుకోకుండా ఉంటే మంచిది. ఎక్కువసేపు కూర్చోకుండా, యోగా, వ్యాయామం చేయడం వలన నివారించవచ్చు.
 
 హోమియో చికిత్స వలన ప్రయోజనం ఉంటుందా?

 
 మొదటి మూడు దళలలోని హెమరాయిడ్‌లను పూర్తిగా నయం చేయటమేకాక, శస్త్రచికిత్స, అవసరం లేకుండా చేస్తుంది. అంతేకాకుండా హెమరాయిడ్ వలన వచ్చే బలహీనతను తగ్గించి, శాశ్వతంగా రాకుండా చేస్తుంది. హోమియోలో ఆస్‌కులస్ హిప్, ఆలోస్, హెయాములస్, కొలింగ్ సోనియా, ఆర్గనిక్ ఆల్, నక్సామికా మందులు బాగా పనిచేస్తాయి.
 
 డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో),
 స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్ ph: 7416 107 107

 

మరిన్ని వార్తలు