అతి వ్యాయామంతో గుండెకు చేటు

26 Feb, 2016 23:14 IST|Sakshi
అతి వ్యాయామంతో గుండెకు చేటు

పరిపరి  శోధన

ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి, తీరైన శరీరాకృతికి, మంచి ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరి అని వైద్యులు సలహా ఇస్తుంటారు. వ్యాయామం ఒంటికి మంచిదే గానీ, అతిగా చేస్తే మాత్రం గుండెకు చేటు తెచ్చిపెడుతుందని ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

శక్తి మేరకు మాత్రమే ఒక క్రమపద్ధతిలో వ్యాయామం చేయాలని, అలా కాకుండా అతిగా వ్యాయామం చేస్తే గుండె లయలో అనూహ్యమైన మార్పులు తలెత్తి, గుండె పనితీరును దెబ్బతీస్తాయని, దీనివల్ల ఒక్కోసారి అకస్మాత్తుగా గుండెపోటు తలెత్తే అవకాశాలూ ఉంటాయని మెల్‌బోర్న్‌లోని హార్ట్ అండ్ డయాబెటిస్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
 

 

మరిన్ని వార్తలు