విహారం సురక్షితం...

9 May, 2015 00:17 IST|Sakshi
విహారం సురక్షితం...

ట్రావెల్ టిప్స్
 
ఊళ్లు, కొత్త ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ఇంటి రక్షణ కోసమే కాదు తమ గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రయాణానికి ముందుగానే ప్రణాళిక అవసరం. వెళ్లిన చోట ఉండబోయే వసతి సదుపాయాలన్నీ ముందుగా బుక్ చేసుకొని, ఆ వివరాలన్నీ బుక్‌లో పొందుపరుచుకోవాలి. ఆ బుక్ కూడా ప్రయాణంలో మీతో పాటే ఉండాలి. రాత్రిళ్లు ప్రయాణం సుఖం అని చాలా మంది అనుకుంటారు. కానీ, అదంత క్షేమదాయకం కాదు. ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ కాబట్టి, పగటి ప్రయాణాలను ఏవిధంగా ఆనందించాలి అనే విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలి.

 మీరు దిగిన హోటల్‌లో మేనేజర్‌ని సంప్రదించి, స్థానికంగా ఏవి సురక్షితమైన ప్రదేశాలో కనుక్కొని వెళ్లడం క్షేమం. నగర శివార్లకు పిల్లలు, మహిళలు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం.మీ పాస్‌పోర్ట్‌సైజ్ ఫోటోతో సహా అన్ని డాక్యుమెంట్లు ప్రయాణంలో మీతో పాటు సురక్షితంగా ఉంచుకోవాలి. ఏదైనా అనుకోని ప్రమాదం వాటిల్లినప్పుడు పనులు వేగవంతం అవడానికి సహాయకారిగా ఉంటాయి.
  అత్యంత రద్దీగా ఉండే ఉండే ప్రదేశాలకు వెళ్లడం మానుకోవడమే సముచితం.
 

మరిన్ని వార్తలు