వైభవం పోయింది,సంస్కృతి మిగిలింది

14 Dec, 2014 00:26 IST|Sakshi
వైభవం పోయింది,సంస్కృతి మిగిలింది

పాతకాలపు ‘ఆయిరన్’ వేషం ధరించిన యువతుల్ని ఫొటోలో చూడవచ్చు. ఆయిరన్ అంటే అత్యున్నత శ్రేణి వేశ్య. వీళ్లు సాధారణ వేశ్యల్లాగా కేవలం శరీరసుఖానికే పరిమితం కారు. వాళ్లు మనసుల్ని రంజింపచేయడంలో నేర్పరులు. పుష్పాలంకరణ(ఇకెబెనా) తెలియడం, గ్రీన్ టీ కాయగలగడం, అందమైన దస్తూరి కలిగివుండటం వీరి కనీసార్హతలు. వీళ్ల వస్త్రధారణ సమాజాన్ని ప్రభావితం చేసేది.

వీళ్లు ‘పామర’ భాష మాట్లాడరు; సభాభాషలోనే సంభాషిస్తారు. 1600 నుంచి 1868 దాకా జపాన్‌లో కొనసాగిన ‘ఎడో పీరియడ్’లో ఆయిరన్లు ఒక వెలుగు వెలిగారు. కాలపు మార్పుల్లో ఈ వృత్తి కనుమరుగై, ‘సంస్కృతి’గా నిలిచిపోయింది. దానికి గుర్తుగానే ‘ఆయరన్ డోచు’గా పిలిచే ఈ ప్రదర్శన టోక్యోలోని ప్రాచీన వేశ్యావాటికల సమీపంలో ప్రతి ఏడాదీ జరుగుతుంది.

మరిన్ని వార్తలు