అంతా ‘రాత’ మహత్యం!

27 Feb, 2016 23:15 IST|Sakshi
అంతా ‘రాత’ మహత్యం!

హ్యూమర్
విధిని ఇంగ్లిష్‌లో ఫేట్ అంటుంటారు. ఫేట్ అనేదానికి ఫేస్ ఉండదు. కానీ వెక్కిరించడం దీని హాబీ. కండరాలు ఉండవు. కానీ బలమైనది. ‘విధి బలీయమైనది’ అని అందరూ అంటుంటారు. బలమైనది అనడానికి బదులు... బలీయం అనే మాటను విధికి విధిగా ఎందుకు వాడతారో పండితులకు మాత్రమే తెలుసేమో. అయితే విచిత్రం ఏమిటంటే పామరులూ అదే మాట వాడుతుంటారు.
 కొందరు మహనీయులుంటారు. విధిరాతతో సహా దేనినైనా వాళ్లు మార్చగలమంటారు. ఇడ్లీ రౌండ్‌గానే ఎందుకు ఉండాలని వాళ్లు ప్రశ్నిస్తారు.

సంప్రదాయానికి తాము ఎదురు నిలవగల ధీరులమంటారు. ఇడ్లీ పాత్రలో ఇడ్లీ మూసను నలు చదరాకారంగానో, త్రిభుజాకారంలోనో రూపొందిస్తారు. సమోసా షేప్‌లో ఇడ్లీని తయారు చేస్తారు. తాము దేన్నైనా మార్చగలమని ఈ కారణ జన్ములు ఇలా సెలవివ్వగానే... అలా నమ్మేస్తారు కొందరు. కానీ ఇడ్లీపాత్రను అడ్డుపెట్టి ఇడ్లీల షేపు మార్చగలరేమోగానీ దాని టేస్టు మార్చగలరా? విధీ అంతే... ఇంచుమించు ఇడ్లీతో సమానం.
 
విధిరాత బాగుండాలని అందరూ కోరుకుంటారు. కానీ చెల్లని నాణేనికి లాగానే దాని గీతలూ గజిబిజిగా ఉంటాయట. ముఖానికి రింకిల్స్ వచ్చినట్లుగానే సాధారణంగా విధిరాత అనే సదరు హ్యాండ్ రైటింగ్ ఎప్పుడూ కాస్త అర్థం కాకుండా ఉంటుందని దాని గురించి ఆందోళన పడేవాళ్లు అనే మాట. అందుకే విధిరాతనూ, బ్రహ్మరాతనూ ఒకేలా పరిగణిస్తుంటారు. అందుకేనేమో ఆ బ్రహ్మరాతను రాసే రైటర్‌ను విధాత అని కూడా అంటుంటారు. డాక్టర్ విధాతగారు సాధారణంగా మనిషి నుదురును తన  ప్రిస్క్రిప్షన్ పేపర్‌లాగా ఉపయోగి స్తుంటారని బాగా చదువుకున్నవాళ్లు అంటుంటారు.
 
అసలు విధి, బ్రహ్మ ఒకటేనని శాస్త్రాలన్నీ తెలిసినవాళ్లు అంటుంటారు. కానీ వాక్యనిర్మాణంలో విధి గురించి చెప్పేటప్పుడు ఫిమేల్‌గానూ, బ్రహ్మను మేల్‌గానూ చెబుతూ జెండర్ డిఫరెన్స్ చూపిస్తారు. విధికి ‘గేమ్స్ అండ్ స్పోర్ట్స్’ బాగా తెలుసని చాలామంది అంగీకరించే సత్యం. ఆటల్లో దానికి మక్కువ ఎక్కువట. అందుకే అది తమతో గేమ్స్ ఆడుకుంటూ ఉంటుందని వాళ్ల అభిప్రాయం. అయితే సదరు క్రీడలో విధికి నైపుణ్యం చాలా ఎక్కువ. అందుకే విధి ఆడే ఆటలో అది మాత్రమే ఎప్పుడూ గెలుస్తుంది.

అందుకే సదరు స్పోర్ట్‌లో ఎప్పుడూ దానికి తలవంచాలని అనుభవజ్ఞులు చెబుతుంటారు.
 అన్నట్టు... ఫైన్ ఆర్ట్స్ విభాగంలో విధికి డ్రామాలు చాలా ఇష్టమట. అయితే అది ఎప్పుడూ వింత వింత నాటకాలు ఆడుతుంటుందనేది జీవితాన్ని కాచి వడబోసిన వారి ఉవాచ. అందుకే వారు ‘విధి ఆడే వింత నాటకం’లో... అంటూ ఒక స్టాక్ డైలాగ్ చెబుతుంటారు.  విధి విషయంలో వారి వారి వ్యక్తిగత అనుభవాలు అందరికీ ఉంటాయి. విధి దేవత అనే మాట లేదు గానీ... శనిదేవుడి కంటే విధికే ఎక్కువ భయపడుతుంటారు.

దాని పట్ల ఇంతగా  భయం ఉన్నందు వల్లనే తాము చేసే పనులకూ, బాధ్యతలనూ ‘విధులు’ అనే బహువచన రూపంలో చెబుతుంటారు. విధికి దయా దాక్షిణ్యాలు కరువు అని కాస్త భయం భయంగా చెబుతుంటారు.  మనం ప్రయాణం చేయడానికి అవసరమైన రోడ్లను ఆర్ అండ్ బీ విభాగం వేసినా వేయకపోయినా విధి మాత్రం తప్పక నిర్మిస్తుందట. సదరు రహదారులలో ఎత్తుపల్లాలు చాలా ఎక్కువట. అందుకే సదరు రోడ్లపై బాగా ప్రయాణం చేసిన వారి గురించి అనుభవజ్ఞులు మాట్లాడుతూ ‘వారు ఎక్కని ఎత్తుల్లేవూ, వారు చూడని పల్లాలు లేవు’ అని అంటుంటారు.
 
‘తమరు ఏం ఆదేశిస్తే అదే చేస్తాను’ అనే సారాన్ని ఒకే మాటలో చెప్పడానికి ‘విధే’యుడు అనే పదాన్ని వాడతారు. పాలసీ మ్యాటర్ అనగా అది తప్పక పాటించాల్సిన రూల్ కాబట్టీ, అంత పవర్‌ఫుల్ కాబట్టే దాన్ని ‘విధానం’ అంటారు. విధివిధానాలు అనే మాటను ద్వంద్వసమాసంగా వాడుతుంటారు. దైవ లీలలలాగానే విధిలీలలూ ఒక పట్టాన అర్థం కావట. విధికి లక్ అనే పర్యాయపదం ఉందని చెబుతూ ఉన్నప్పటికీ... దాన్ని దురదృష్టంతోనే ఎక్కువగా ముడివేస్తుంటారు. అందుకేనేమో... శిక్షనూ, జరిమానాను వేసినప్పుడు దాన్ని పనిష్మెంట్‌లాగా చూపుతూ ‘విధిం’చారు అనే మాటను వాడుతుంటారు.
 
ఇది చివరివరకూ చదివినవారు ఒక్క మాటను ఇష్టమున్నా లేకున్నా అంగీకరించి తీరాలి. సాధారణంగా విధికి మరో మాటగా వాడుతుండే ఒక మాటను స్మరించాలి. అదే ఖర్మ. తమ ఖర్మ కొద్దీ ఇలా జరిగిందనీ, ఇందుకు ఈ వ్యాసకర్త ఎంతమాత్రమూ బాధ్యడు కాదనీ విజ్ఞులైన పాఠకులు గ్రహించాలి.
  - యాసీన్

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

శంకర విజయం-4

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!