చైల్డ్‌ లైన్‌ దారిలోకొచ్చేదెపుడు?

26 Sep, 2018 03:17 IST|Sakshi

అభిప్రాయం

2002వ సంవత్సరం డిసెంబర్‌ 13న బాల కార్మిక వ్యవస్థను దేశ వ్యాప్తంగా నిర్మూలిస్తూ ఆర్టి కల్‌ 24ను సవరించి 84వ రాజ్యాంగ సవరణ మేరకు పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలని చట్టాన్ని సవరించారు. ఆ నాటి నుంచి పిల్లల రక్షణ, పరిరక్షణకు చైల్డ్‌ లైన్‌ అనే సహా యక బృందం ఉండాలని ఆ సహాయక బృందం బాల కార్మికులను రక్షించడానికి రోజుకు 24 గంటలు వారానికి ఏడు రోజులు పని చేయాలనే సదుద్దేశంతో 1098 అనే ప్రత్యేక ఫోన్‌ నంబర్‌ను కేటాయిస్తూ చైల్డ్‌ లైన్‌గా, చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌గా సంబోధిస్తున్నారు.

చైల్డ్‌ లైన్‌ను స్థాపించిన నాటి నుంచి నేటి వరకు పిల్లల రక్షణకు 1098 అనే నంబర్‌ ఉన్నదని, ఎప్పు డైనా ఫోన్‌ చేస్తే పిల్లలను ఆదుకుంటారనే విషయం బహు కొద్దిమందికి మాత్రమే తెలుసన్నది అతిశ యోక్తి కాదు. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో నడిచే ఈ చైల్డ్‌ లైన్‌ దక్షిణ భారత దేశంలో ఒకే ఒక్క చెన్నై కేంద్రంగా పలు రాష్ట్రాల నుంచి వచ్చే ఫోన్లను స్వీకరిస్తూ ఆయా రాష్ట్రాలకు, జిల్లాలకు చేర వేస్తుంది. కేవలం ఒకే కేంద్రం నలుమూలల నుంచి∙వచ్చే ఫోన్లను స్వీకరించి మళ్లీ ఆ సమాచారాన్ని ఆయా ప్రాంతాలకు చేరవేయాలంటే ఎంత కసరత్తు చేయాలి. సిబ్బంది ఎంత ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుందనే పరిస్థితితోపాటు, అవసరాలకు అనుగు ణంగా ఈ వ్యవస్థ పని చేయగలుగుతుందా అన్నది ప్రశ్నలాగే మిగిలిపోతుంది.

చైల్డ్‌ లైన్‌ వ్యవస్థలో ఒక్కో జిల్లాకు ఒక్కో యూనిట్‌గా పనిచేసే కేవలం ఎని మిదిమంది సిబ్బంది మాత్రమే ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, కొన్ని జిల్లాల్లో అసలు చైల్డ్‌ లైన్‌ యూనిట్‌ లేదనేది సిగ్గుచేటైన వాస్తవం. అలాగే వందా ముప్పైకోట్ల జనాభా కలిగిన దేశానికి నాలుగు చైల్డ్‌ లైన్‌ కేంద్రాలు మాత్రమే ఉండటం ఘోరం.హైదరాబాద్‌ లాంటి మహా నగరంలో ఎనిమిది మందితోనే పని నెట్టుకొస్తోంది. ఈ పదిమందిలో ఒకరు కో–ఆర్డినేటర్, ఓ కౌన్సిలర్, ఆరుగురు కార్య కర్తలతో నెట్టుకొస్తున్నది. వీరికి కూర్చోవడానికి సరైన వసతి లేకపోవడంతో గతంలో కలెక్టర్‌ కార్యా లయంలో కూర్చునే వీరు ప్రస్తుతం భరోసా సెంటర్లో కూర్చోవడంతో మా పంచన చేరారనే భావనతో వారిని భరోసా అధికారుల వ్యక్తిగత పను లకు వినియోగిస్తున్నట్లు వినికిడి.

ఈ చైల్డ్‌ లైన్‌ వ్యవస్థ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధీనంలో ఉన్నప్పటికీ ఆ శాఖ నేరుగా నడిపించలేక కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ఈ చైల్డ్‌ లైన్‌ను అంట గట్టడంతో ఆ స్వచ్ఛంద సంస్థలు సహితం చేసిన పనికి డబ్బులు రాబట్టుకునే సరికి విసిగి, వేసారి ఛీ.. చైల్డ్‌ లైన్‌ అనే స్థితికి వచ్చింది. ఆ స్వచ్ఛంద సంస్థ, వారి చైల్డ్‌ లైన్‌ సిబ్బందికి జీతాలు రాకపోవడంతో చివరకు ఆ పనినే వదులుకుంది.పిల్లలను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి చేసినప్పుడు, హింసల నుంచి చేరదీసినప్పుడు, బిచ్చగాళ్ల, వ్యభిచార ముఠాల నుండి కాపాడిన ప్పుడు ఆ పిల్లలను చాలా సురక్షితంగా శిశు గృహా లకు, బాల బాలికల గృహాలకు రక్షించాల్సిన గురు  తర బాధ్యత కలిగిన చైల్డ్‌ లైన్‌కు తగిన రక్షణగానే పిల్లలను తరలించడానికి వాహనాలుగానీ, పిల్లలకు అప్పటికప్పుడు ఆహారం, ప్రాథమిక వైద్యం కల్పించ డానికి ఎలాంటి వసతులు లేక కేవలం చైల్డ్‌ లైన్‌కు చెందిన కార్యకర్త సంఘటనా స్థలానికి వచ్చి పిల్ల లను సురక్షితంగా తరలించడానికి ఎవరు సహకారం అందిస్తారా అని బేలగా చూసే సందర్భాలు అను నిత్యం కనిపిస్తాయి.

పిల్లలను రక్షించి వసతి గృహా లకు తరలించే సున్నితమైన, అత్యంత బాధ్యతాయు తమైన పని ప్రజారవాణా ద్వారానే జరుగుతుం     డటం, కొన్నిసార్లు చైల్డ్‌ లైన్‌ వాలంటీర్లపై దాడులు  సైతం జరిగిన సందర్భాలు లేకపోలేదు.పిల్లల రక్షణ, పరిరక్షణలో అత్యంత కీలక బాధ్యత వహించే చైల్డ్‌ లైన్‌ ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా కేంద్రాలుగా ఇంత పెద్ద దేశానికి పనిచేస్తూ దారి, గమ్యం లేక కొట్టుమిట్టాడు తుండటమే కాక, ఆ కార్యకర్తలు నెలకు కేవలం ఆరువేల రూపాయల జీతంతో పనిచేస్తున్నా రంటే, వారికి నిర్దిష్టమైన బాస్‌ లేక... ప్రతి ఒక్కరూ అధికారం చెలాయిస్తూ, ఎవరి మాట వినాలో, ఎవరి మాట వినకూడదో, ఎవరికి కోపం వస్తే ఏమిటో అన్నట్లున్న చైల్డ్‌ లైన్‌ ఉద్యోగుల పరిస్థితి ఉంటే, అసలు చైల్డ్‌ లైన్‌కు ఒక కార్యా లయం, అస్థిత్వం ఎందుకు లేదు అన్నదే ప్రశ్న. స్వచ్ఛంద సంస్థలపై ఆధారపడకుండా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఎందుకు చైల్డ్‌ లైన్‌ నిర్వహించలేక     పోతున్నది? మానవ వనరులు లేకనా, పిల్లలకు సమస్యలు లేకనా? అసలు అధికారులకు మనసు లేకనా? పిల్లల పరిరక్షణలో కీలకపాత్ర పోషించే చైల్డ్‌ లైన్‌ను ఎప్పుడు దారిలో పెడతారన్నది ప్రశ్న?


వ్యాసకర్త
అచ్యుతరావు
గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం
ఫోన్‌ నెంబర్‌: 93910 24242

మరిన్ని వార్తలు