పుష్కర ప్రత్యేక రైళ్ల తేదీల్లో మార్పు

11 Jul, 2015 01:45 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్ : నగరం నుంచి బాసర, భద్రాచలం వెళ్లేందుకు గతంలో ప్రకటించిన పుష్కరాల ప్రత్యేక రైళ్ల తేదీల్లో స్వల్ప మార్పు చేసినట్లు  దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాచిగూడ-ధర్మాబాద్ మధ్య నడిచే స్పెషల్ ట్రైన్ ఈ నెల 13, 15, 17, 19, 21, 23, 25 తేదీలకు బదులు 13, 14, 17, 18, 21, 22, 25,26 తేదీల్లో ఉదయం 7 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి అదేరోజు ఉదయం 11.30కు ధర్మాబాద్ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు ధర్మాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 4కు కాచిగూడ చేరుకుంటుంది. సికింద్రాబాద్-భద్రాచలం వెళ్లే  స్పెషల్ ట్రైన్ ఈ నెల 14, 16, 18, 21, 23, 25 తేదీలకు బదులు 15, 16, 19, 20, 23, 24 తేదీలలో ఉదయం 6.10 కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు ఉదయం 11.40 కి భద్రాచలం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు మధ్యాహ్నం 1.25 కు భద్రాచలం నుంచి బయలుదేరి సాయంత్రం 7.55 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

సికింద్రాబాద్-మణుగూర్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 13, 15, 17, 20, 22, 24 తేదీలకు బదులు 13,14,17,18,21,22 తేదీల్లో ఉదయం 6.10 కి బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 1.30 కు మణుగూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం లో అదేరోజు మధ్యాహ్నం 2.30 కు బయలుదేరి రాత్రి 10గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
 
పలు రైళ్ల రద్దు: గుంతకల్ డివిజన్‌లోని గుత్తి-ధర్మవరం స్టేషన్‌ల మధ్య నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నెల 11, 16, 18 తేదీల్లో కాచిగూడ -తిరుపతి (22120) డబుల్‌డెక్కర్, అలాగే 12, 17, 19 తేదీల్లో తిరుపతి-కాచిగూడ (22119) డబుల్ డెక్కర్, ఆదిలాబాద్-నిజామాబాద్,ఆదిలాబాద్-పూర్ణ స్పెషల్ ట్రైన్స్ ఈ నెల 16, 23 తేదీల్లో రద్దు కానున్నాయి.

మరిన్ని వార్తలు