'నిమజ్జనం కోసం 25వేల భద్రతా సిబ్బంది'

26 Sep, 2015 15:47 IST|Sakshi
'నిమజ్జనం కోసం 25వేల భద్రతా సిబ్బంది'

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఆదివారం జరగబోయే వినాయక నిమజ్జనం కోసం 25 వేల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన 'సాక్షి' మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా, తమిళనాడు పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. కమాండింగ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా 400 సీసీ కెమెరాలతో మానిటర్ చేస్తాం. గతంలో ఇబ్బందులు ఎదురైన ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించాం. నిమజ్జనం దారిలోని ప్రతి కూడాలిలో సీసీ కెమెరాలు అమర్చుతాం. ఎలాంటి ఘటన జరగకుండా కమాండింగ్ కంట్రోల్ ద్వారా మానిటర్ చేయనున్నాం. విధుల్లో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేస్తాం' అని చెప్పారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం మొదటిరోజే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాలానగర్ గణేష్ నిమజ్జనయాత్ర ప్రారంభమయ్యేంత వరకు ఆగాల్సిన పనిలేదని తెలిపారు. ఉదయం నుంచి నిమజ్జన యాత్రలు నిర్వహించుకోవచ్చన్నారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో దాదాపు 70కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాలు చేస్తామని చెప్పారు. భక్తులు, స్థానిక ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే 100 నంబరుకు కాల్ చేయాలని సీపీ మహేందర్ రెడ్డి  సూచించారు.

మరిన్ని వార్తలు