రూ.100 కోట్లు తాగేశారు!

24 Oct, 2015 00:39 IST|Sakshi
రూ.100 కోట్లు తాగేశారు!

సిటీబ్యూరో: దసరా సెలవులకు గ్రేటర్ పరిధిలో మందు బాబులు మస్త్ మజా చేసుకున్నారు. మద్యం అమ్మకాలు చుక్కలను తాకాయి. గతఏడాదితో పోలిస్తే అమ్మకాలు రూ.25 కోట్ల మేర పెరిగినట్లు ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్ పరిధిలోని 460 మద్యం దుకాణాలు, మరో 500 బార్లలో మద్యం అమ్మకాల జోరు పెరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారుల అంచనా. ఈ నెల 1 నుంచి 22 వరకు అమ్మకాలు చుక్కలను తాకినట్లు పేర్కొన్నాయి. సాధారణంగా గ్రేటర్‌లో రోజుకు రూ.10 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు జరుగుతుండగా దసరా సందర్భంగా సోమ, మంగళ, బుధ, గురువారాల్లో అమ్మకాలు సుమారు రూ.25 కోట్ల మేర ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

అంటే మొత్తంగా గ్రేటర్ పరిధిలో పండగ సెలవులకు మందుబాబులు రూ.100 కోట్ల మేర ‘తాగే’శారన్న మాట. గత ఏడాది ఈ సమయంలోఅమ్మకాలు రూ.75 కోట్లకు మించలేదని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మద్యం దుకాణాల్లో ఐఎంఎల్ మద్యంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. గత 22 రోజులుగా 10 లక్షల కేసుల బీర్లు అమ్ముడు పోయినట్లు ఎకై ్సజ్ శాఖ లెక్కగట్టింది. ఐఎంఎల్ మద్యం 7 లక్షల కేసులు అమ్ముడుపోయినట్లు అంచనావేసింది.

మరిన్ని వార్తలు