తెలుగు సినిమాల్లో డబ్బింగ్ పాటలు

18 Apr, 2016 01:46 IST|Sakshi

పరిశోధన: డాక్టర్ పైడిపాల; పేజీలు: 320; వెల: 175; ప్రతులకు: రచయిత, 11-20, కొంకాపల్లి, అమలాపురం-533201; ఫోన్: 9989106162
 ‘తెలుగు సినిమాపాట చరిత్ర’, ‘తెలుగు సినీగేయకవుల చరిత్ర’ వెలువరించిన పైడిపాల నుంచి వచ్చిన తాజా పరిశోధన ఈ గ్రంథం. ఈ ‘అనుసంధాన కళ’ గురించిన పూర్వరంగం చెప్పి, డబ్బింగ్ పాటలు రాయడంలో ఎవరి శైలి ఏమిటి, వారి గొప్ప పాటలు ఏమిటి, మూలం నుంచి దూరం జరిగికూడా గొప్పమార్కు చూపించిన పాటలేమిటి, మూలాన్ని పట్టుకోలేని పాటలేమిటి లాంటి అంశాలను నిర్మొహమాటంగా ప్రస్తావిస్తూ వెళ్తారు. శ్రీశ్రీ, రాజశ్రీ, వెన్నెలకంటి నుంచి నేటి వనమాలి, కందికొండ దాకా ముఖ్యమైన డబ్బింగ్ కవులందరినీ స్పృశించారు. తెలుగులో వచ్చిన డబ్బింగ్ సినిమాల, డబ్ చేసినవాళ్ల జాబితాలు అదనంగా ఇచ్చారు.
 
 విశ్వపతి కార్టూన్లకు ప్రశంస
 విశ్వపతి కలంపేరుతో కార్టూన్లు వేసే టి.వి.ఆర్.కె.మూర్తి ఇటీవల ‘సిన్సియర్లీ యువర్స్’ పేరిట కార్టూన్ల సంకలనం తెచ్చారు. ‘కార్టూన్లు సమకాలీన సమాజ పరిస్థితులకు అద్దం పడుతున్నా’యని ఆయన్ని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అభినందించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్లు కె.రోశయ్య, సీహెచ్.విద్యాసాగరరావు కూడా అభినందనలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు