ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి

28 Aug, 2016 01:59 IST|Sakshi
ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి

మంత్రి ఈటలకు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను  జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోరింది. శనివారం సచివాల యంలో సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, తెలంగాణ శాఖ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మంత్రిని కలసి పలు అంశాలపై చర్చించారు. 2015-16 సంవత్సరం వరకు  రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 3,100 కోట్లకు గానూ, రూ.900 కోట్లనే విడుదల చేశారని కృష్ణయ్య తెలిపారు. బీసీ కార్పొరేషన్, 11 బీసీ కులాల ఫెడరేషన్‌ల ద్వారా రుణాల కోసం 39వేల మంది ఎంపికైనప్పటికీ, ప్రభుత్వం పైసా విడుదల చేయలేదన్నారు.

రాష్ట్రంలో 500 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు గానూ, 50 మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని, కానీ ఒక్కటీ మంజూరు కాలేదని అన్నారు. దీనిపై మంత్రి ఈటల స్పందిస్తూ బీసీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, రుణాలకు నిధుల విడుదలకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. రైతుల రుణమాఫీ కింద ఈ విడత 2 వేల కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పా రు. కార్యక్రమంలో బీసీ నాయకులు బోర సుభాష్, శ్రీనివాస్, గూడూరు భాస్కర్ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు