‘హుస్సేన్‌సాగర్‌లో కాలుష్యాన్ని తగ్గించండి’

28 Apr, 2016 13:54 IST|Sakshi

హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ కాలుష్యాన్ని తగ్గించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై గురువారం విచారణ సందర్భంగా ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న విధంగా చర్యలను తీసుకోవాలని సూచించింది. అలాగే, గణేశ విగ్రహాల తయారీలో సహజ రంగులనే వాడేలా చర్యలు చేపట్టాలని కోరింది. హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేక ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కాగా సహజరంగులు వినియోగానికి రూ.5 కోట్లు కేటాయిస్తామని, విగ్రహాల ఎత్తు తగ్గింపుపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. తదుపరి విచారణను జూలై 4వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు