డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలపై ఫిర్యాదుల వెల్లువ

23 Aug, 2017 01:09 IST|Sakshi
డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలపై ఫిర్యాదుల వెల్లువ
విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు: కడియం 
 
సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల మూడో దశ సీట్ల కేటా యింపులో నెలకొన్న గందరగోళంపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో హెల్ప్‌డెస్క్‌ను ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసింది. సోమవారం వరకు వచ్చిన ఫిర్యాదులపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్షించారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మూడో దశ కౌన్సెలింగ్‌లో ఈ నెల 17న రివైజ్డ్‌ సీట్ల కేటాయింపులో సీట్లు పొందిన వారు ఈనెల 23లోగా కాలేజీల్లో చేరే అవకాశముంది. 
 
రేపు తుది నిర్ణయం..: సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరిన వారు పోగా, మిగతా వారి కోసం మరో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తోంది. లేదా ఆయా కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉంటే విద్యార్థుల ఆప్షన్ల ప్రకారం సీట్లు కేటాయించాలని యోచనలో ఉంది. దీనిపై 24న తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది.  
>
మరిన్ని వార్తలు