-

హైదరాబాద్‌ @ 39.2 డిగ్రీలు

27 Mar, 2017 00:17 IST|Sakshi
హైదరాబాద్‌ @ 39.2 డిగ్రీలు

నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

సాక్షి, హైదరాబాద్‌: వేడి గాలులు నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో 39.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో 48 గంటల పాటు హైదరాబాద్‌లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని, వేడిగాలులు కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలో బయటికి వెళ్లేవారు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  

విద్యుత్‌ వినియోగం పైపైకి...
నగరంలో ఉష్ణోగ్రతలు అనుహ్యంగా పెరగడం తో విద్యుత్‌ వినియోగం కూడా రెట్టిపైంది. గ్రేటర్‌లో గత 2 రోజుల్లో విద్యుత్‌ వినియోగం 53.8 మిలియన్‌ యూనిట్లు నమోదైంది. మార్చి లోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మేలో విద్యు త్‌ వినియోగం 60 ఎంయూలు దాటే అవకాశం ఉందని డిస్కం అంచనా వేస్తోంది. పెరుగుతు న్న విద్యుత్‌ ఒత్తిడిని తట్టుకోలేక ఫీడర్లు ట్రిప్ప వుతూ సరఫరాకు అంతరాయం కలిగిస్తు న్నా యి. ఒత్తిడిని తట్టుకునేవిధంగా ఇప్పటికే సరఫ రా వ్యవస్థను తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు.

రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి..
గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామా బాద్, రామగుండంలలో 40 డిగ్రీల చొప్పున, హన్మకొండ, ఖమ్మం, మెదక్‌లలో 39 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 48 గంటలు రాష్ట్రంలో సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరా బాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌...
 ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ అమాంతం పెరిగింది. గత మార్చిలో 148.73 మిలియన్‌ యూనిట్లుగా ఉన్న విద్యుత్‌ డిమాండ్‌ కాస్తా ఈ మార్చిలో ఏకంగా 184.11 మి.యూనిట్లకు పెరిగింది.

వడదెబ్బతో నలుగురి మృతి
నెట్‌వర్క్‌: వడదెబ్బతో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు మృతిచెందారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం యల్లాపురంలో గడగోజు దుర్గాచారి(51), రంగుండ్లలో ఆంగోతు రవి నాయక్, ఇదే జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో నక్క చంద్రమ్మ (70), మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గొల్ల నర్సింలు (56) వడదెబ్బతో మృతి చెందారు.

మరిన్ని వార్తలు