డ్రగ్స్‌... వద్దురా..సోదరా!

23 Jul, 2017 08:24 IST|Sakshi
డ్రగ్స్‌... వద్దురా..సోదరా!
హైదరాబాద్‌: ‘యువతా మేలుకో... డ్రగ్స్‌ను వదులుకో’... డ్రగ్స్‌ మాఫియా పనిపడదాం.. అంటూ విద్యార్థి లోకం నినదించింది. జీవితాలను నాశనం చేస్తున్న మత్తుకు దూరంగా ఉందాం అంటూ అవగాహన ర్యాలీలు నిర్వహించింది. శనివారం నగరంలోని పలు కళాశాలలు, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ‘డ్రగ్స్‌ వద్దురా.. సోదరా’ అంటూ నినాదాలు చేశారు.  బాచుపల్లి వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్యార్థులు నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు.

బ్యానర్లు, ప్లకార్డులను పట్టుకొని మత్తు ప్రభావంతో కలుగుతున్న అనర్థాలపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్‌ ధనుంజయనాయుడు, కళాశాల ప్రెసిడెంట్‌ డీఎన్‌ రావు, సెక్రటరీ శరత్‌ గోపాల్, ఐటీ హెచ్‌వోడీ డాక్టర్‌ జి.సురేష్, శ్రీరామ్, ప్రొఫెసర్‌ మల్లిక, విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్, మోహిదీపట్నం, జేఎన్‌టీయూ, మలేషియా టౌన్‌ షిప్, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, పంజగుట్ట సర్కిల్, కేబీఆర్‌ పార్కు, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్, పిపుల్స్‌ ప్లాజా తదితర ప్రాంతాల్లో మానవహారాలు నిర్వహించారు.
 
 
 
 
మరిన్ని వార్తలు