బ్యాంకర్ల తీరుపై ప్రభుత్వం కళ్లు తెరవాలి: రేవంత్‌

25 Jun, 2017 00:52 IST|Sakshi
బ్యాంకర్ల తీరుపై ప్రభుత్వం కళ్లు తెరవాలి: రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు రుణాల విషయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావే శంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ బ్యాంకర్ల తీరుపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడంతో నైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని టీటీడీపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. బ్యాంకర్ల తీరుపై పలు ఆందోళనల సందర్భంగా ప్రభుత్వానికి నివేదించిన అంశా లనే ఆర్థికమంత్రి ఈటల అధికారికంగా మాట్లా డారని చెప్పారు. రైతు రుణమాఫీని పూర్తిచేయ డంతోపాటు బ్యాంకుల్లో ఉన్న రైతుల పాసుపుస్త కాలను తక్షణమే విడుదల చేయించాలని డిమాండ్‌ చేశారు.

కేవలం సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్‌ రావు నియోజకవర్గాల్లోనే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కడుతున్నారని, రాష్ట్రంలో మరెక్కడా ఇళ్లు పూర్తి కావడంలేదని ఈటల మాటలతోనే తేలిపోయిం దన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై రాష్ట్రంలో ప్రచారం తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆర్థిక మంత్రి వ్యాఖ్యలతో ప్రజలు అర్థం చేసుకోవాలని రేవంత్‌రెడ్డి సూచించారు. రైతు రుణమాఫీ వల్ల బ్యాంకులు లాభపడ్డాయని, రైతులకు ఎలాంటి ప్రయోజనమూ కలగలేదని ఆయన విమర్శించారు.

మరిన్ని వార్తలు