8 నుంచి ‘సాక్షి ఎడ్జ్‌’ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ

7 Sep, 2017 03:38 IST|Sakshi
8 నుంచి ‘సాక్షి ఎడ్జ్‌’ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ

బంజారాహిల్స్, దిల్‌సుఖ్‌నగర్‌లలో బ్యాచ్‌లు
సాక్షి, హైదరాబాద్‌: ఇంగ్లిష్‌.. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది మాట్లాడే భాష. 53 దేశాల్లో అధికారిక భాష.. నేటి టెక్నాలజీ యుగంలో మన దైనందిన జీవితానికి అత్యవసరమైన ఇంటర్నెట్‌ భాష కూడా ఇదే. సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్, ఏవియేషన్, టూరిజం, మెడిసిన్‌.. ఇలా ఏ సబ్జెక్టు నేర్చుకోవాలన్నా, ఏ రంగంలో అవకాశాలు అందుకోవాలన్నా, కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడగలగడం తప్పనిసరి. అంత ప్రాధాన్యమున్న ఇంగ్లిష్‌లో మీరు ఎలాంటి భయం, బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడేలా శిక్షణ ఇచ్చేందుకు ‘సాక్షి ఎడ్జ్‌’ ముందుకు వచ్చింది.

స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణలో విశేష అనుభవమున్న ‘సాక్షి ఎడ్జ్‌’ నిపుణుల వినూత్న బోధన ద్వారా మీరు తక్కువ సమయంలోనే ఆ భాషపై పట్టు సాధించొచ్చు. ఈ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సులో భాగంగా.. స్పీకింగ్, లిజనింగ్‌ స్కిల్స్, ఉచ్చారణ, మాట్లాడటంలో దొర్లే తప్పులను సరిదిద్దడంతోపాటు గ్రామర్‌పైనా అవగాహన కలిగిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన కోర్సు మెటీరియల్‌ను, కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. సీట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి.

స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సు బ్యాచ్‌ల వివరాలు
కొత్త బ్యాచ్‌ ప్రారంభ తేదీ: 08.09.2017
కోర్సు ఫీజు: రూ. 4,600
కాల వ్యవధి: 30 రోజులు (ప్రతి రోజు 2 గంటలు)

బంజారాహిల్స్‌లో..
సమయం:  ఉదయం 7.00 గంటల నుంచి 9.00 గంటల వరకు
రిజిస్ట్రేషన్లు, తరగతులు: సాక్షి ప్రధాన కార్యాలయం, సాక్షి టవర్స్, రోడ్‌ నంబర్‌ 1, కేర్‌ ఆస్పత్రి సమీపంలో, బంజారాహిల్స్, హైదరాబాద్‌.
వివరాలకు: ఫోన్‌ నంబర్‌ 9603533300 లేదా ఈ–మెయిల్‌:  sakshiedge@gmail. comలో సంప్రదించవచ్చు.

దిల్‌సుఖ్‌నగర్‌లో..
సమయం: సాయంత్రం 5.00 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు
రిజిస్ట్రేషన్లు, తరగతులు: సాయి చైతన్య జూనియర్‌ కాలేజీ, న్యూనోబెల్‌ డిగ్రీ కాలేజీ పక్కన, మెట్రో పిల్లర్‌ నంబర్‌ ఎంఎస్‌బీ–30 ఎదురుగా, దిల్‌సుఖ్‌నగర్‌.
వివరాలకు: ఫోన్‌ నంబర్లు 7702011411, 9490805474లో సంప్రదించవచ్చు
సంప్రదించాల్సిన సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా