సిటీ.. గొప్ప వేదిక

28 Jul, 2014 00:17 IST|Sakshi
సిటీ.. గొప్ప వేదిక


షాజీ నీలకంఠన్ కరుణాకరన్ ఉరఫ్ షాజీ కరుణ్.. న్యూవేవ్ సినీప్రియుల అభిమానపాత్రుడు! పిరవి.. స్వాహం.. వానప్రస్థం.. కుట్టీ శ్రాంక్.. సెల్యులారుుడ్‌పై ఆయున మెరుపులు. మెగాఫోన్ చేతికి రాక వుుందే ఆయునది కెమెరా కన్ను. జి.అరవిందన్, కె.జి.జార్జ్, టి.వాసుదేవన్ నాయర్ లాంటి దర్శక దిగ్గజాలు మెచ్చిన సినిమాటోగ్రాఫర్. తాజాగా ఆయన ప్రముఖ చిత్రకారుడు కె.జి.సుబ్రహ్మణ్యన్‌పై  ‘మూవింగ్ ఫోకస్: ఎ జర్నీ విత్ కె.జి.సుబ్రహ్మణ్యన్’ పేరుతో తీసిన డాక్యుమెంటరీని ఆదివారం సాలార్‌జంగ్ మ్యూజియంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా షాజీ కరుణ్‌ను పలకరించగా.. హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారిలా..
 
అలుపులేని ప్రయాణం
62 ఏళ్ల వయసులో కూడా అలుపు లేని ప్రయూణం చేస్తున్న షాజి కరుణ్ సొంతూరు కేరళలోని కొల్లామ్. 1971లో పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి సినిమాటోగ్రఫీలో డిప్లమా చేశారు. 1988లో ఆయన మొదటి సినిమా పిరవికి కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్ కెమెరా డి ఓర్ పురస్కారం దక్కింది. అది మొదలు ఆయన ప్రతి సినిమా అవార్డులు కొల్లగొడుతూనే ఉంది.
 
‘హైదరాబాద్ బ్యూటీ ఈజ్ ప్యూరిటీ! నేను 80ల్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత క్రౌడ్ లేదు. చాలా హాయిగా ఉండేది. విస్తీర్ణంలో కొత్త ఎల్లలు సృష్టిస్తున్న సిటీ.. సహజత్వానికి దూరంగా పోతోందా అనిపిస్తోంది. పాతబస్తీ వూత్రం తన ఉనికిని కాపాడుకుంటోంది. ఇది కొంత ఊరట కలిగించే విషయుం. దేశంలో ఏ నగరానికీ లేని ప్రత్యేకత హైదరాబాద్‌కు ఉంది. అది హిందూ-వుుస్లిం ఐక్యత. ఆతిథ్యం ఇవ్వడంలోనూ ఈ షహర్ షాన్‌దార్ అనే చెబుతాను. ప్రతీ వంటకం నాకిష్టమే. ఈ రుచి వురెక్కడా దొరకదు.

సిటీలైఫే ముడిసరుకు
హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన శ్యామ్ బెనగళ్.. నేను ఇష్టపడే డెరైక్టర్స్‌లో ఒకరు. ఇక నా ఫస్ట్ సినిమా హీరోయిన్ అర్చన.. నా ఆర్ట్ డెరైక్టర్ తోట తరణి.. వీళ్లంతా హైదరాబాద్‌తో నాకున్న సాన్నిహిత్యాన్ని మరింత పెంపొందించినవారే. హైదరాబాద్ సంస్కృతిది స్పెషల్ ఐడెంటిటీ. అభిరుచి ఉండాలే కాని సిటీలైఫ్ సినివూలకు బోలెడు వుుడి సరుకునిస్తుంది. దురదృష్టం ఏంటంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీ కమర్షియల్ ఎలిమెంట్స్ చేతుల్లో చిక్కుకుపోయింది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్ జరిగింది. అప్పుడు ఎన్ని మంచి సినిమాలు స్క్రీనింగ్ అయ్యాయి? కాని, ఎందుకనో అదే స్పిరిట్ కొనసాగించలేకపోయూరు.

ఇక్కడ టాలెంట్‌కు కొదవ లేదు. చక్కటి రచరుుతలు, దర్శకులు ఉన్నారు. అరుునా జాతీయు అవార్డుల్లో తెలుగు సినివూ కనిపించదు. కేరళ, బెంగాల్‌తో పోల్చుకుంటే ప్యారలల్ మూవీ ఫోకస్ అయ్యే అవకాశాలు ఇక్కడే ఎక్కువ. ఎందుకంటే ఆ సినిమాలకు కావల్సిన జీవితం ఇక్కడ సాక్షాత్కరిస్తుంది. మహారాష్ట్ర సినిమా ఇండస్ట్రీ ఆ దిశగా ప్రయూణం మొదలుపెట్టింది. తెలుగు సినివూ వూత్రం కాసుల వర్షం గురించే ఆలోచిస్తుంది. సినివూ వున సంస్కృతికి ప్రతిబింబం. యుంగ్ టాలెంటైనా ఈ వైపు ఆలోచించాలి. ఆ రోజు వస్తే హైదరాబాద్ గ్రేట్ డయూస్ అవుతుంది.’
 
  సరస్వతి రమ

మరిన్ని వార్తలు