నకిలీ మద్యంపై విచారణకు సిద్ధమేనా: వైఎస్సార్ సీపీ

2 Sep, 2014 02:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో నకిలీ మద్యం పంపిణీ, కేసుల వ్యవహారంపై సోమవారం అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. దీనికి సం బంధించి అధికార టీడీపీ సభ్యుడి ప్రశ్న, మంత్రి జవాబిచ్చిన తీరు పెద్ద మ్యాచ్ ఫిక్సింగ్ రీతిలో ఉన్నాయంటూ విపక్షం ఎద్దేవా చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ చేయించడంతోపాటు మద్యనిషేధానికి ప్రభుత్వం సిద్ధ మా? అని వైఎస్సార్ కాంగ్రెస్ సవాల్ చే సింది.  పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు ఎక్సైజ్ మంత్రి కె.రవీంద్ర స్పందిస్తూ సుపరిచిత బ్రాండ్లకు నకిలీ లేబుల్స్ తగిలించి నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్న విషయం తమకు తెలియదన్నారు.
 
ఈ సందర్భంగా పలు కేసుల్ని ఉదహరించిన మంత్రి.. వైఎస్సార్‌సీపీ నేతల పేర్లను ఎక్కువగా ప్రస్తావించారు. కొన్ని పేర్లనే ఉదహరించడం తగదంటూ వైఎస్సార్‌సీపీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం ఎన్ని కేసులున్నాయి.. వాటిల్లో ఏయే పార్టీల వారు ఎందరున్నారో సభ ముందుంచాలని డిమాండ్ చేశారు.  సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు లేచి అన్ని వ్యవస్థలను నాశనం చేసిందే వైఎస్ అనడంతో సభలో గందరగోళం చెలరేగింది. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు అభ్యంతరం తెలి పారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. సీబీసీఐడీ విచారణ తర్వాత వచ్చిన వివరాల ఆధారంగా అవసరమైతే సీబీఐ విచారణ కోరతామని మంత్రి యనమల చెప్పారు.

మరిన్ని వార్తలు