సోమాలియాలో మారణహోమం

29 Dec, 2019 01:23 IST|Sakshi
పేలుడు ధాటికి పూర్తిగా దెబ్బతిన్న కారు

78 మంది దుర్మరణం.. 125 మందికి గాయాలు

మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో శనివారం సంభవించిన భారీ కారు బాంబు పేలుడులో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధానికి నైరుతి ప్రాంతంలోని చెక్‌పోస్ట్‌ వద్ద ట్రాఫిక్‌ భారీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. పేలుడు ధాటికి ఘటనా ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని మృతదేహాలు గుర్తు పట్టడానికి కూడా వీల్లేకుండా కాలిపోయాయి. కొన్ని వాహనాలు మంటల్లో పూర్తిగా కాలిపోగా మరికొన్ని నుజ్జునుజ్జయ్యాయి.

ఈ ఘటనలో కళాశాల బస్సు పేలిపోవడంతో మృతుల్లో అత్యధికులు విద్యార్థులే ఉన్నారు. ప్రస్తుతానికి మృతులు 78 మంది, క్షతగాత్రులు 125 వరకు ఉన్నప్పటికీ ఈ సంఖ్య ఇంకా పెరిగే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యత తమదేనంటూ ఏ ఉగ్ర సంస్థా ఇప్పటివరకు ప్రకటించుకోలేదు. అల్‌ ఖాయిదా అనుబంధ అల్‌ షబాబ్‌ దేశంలో తరచూ కారు బాంబు దాడులకు పాల్పడుతోంది. శనివారం జరిగిన పేలుడు రెండేళ్లలోనే అత్యంత తీవ్రమైంది. 2017లో మొగదిషులో ట్రక్కు బాంబు పేలి 512 మంది చనిపోగా 300 మంది గాయపడ్డారు.

నెత్తురోడుతున్న బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తున్న స్థానికులు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మరో 6 పులులకు కరోనా లక్షణాలు?!

గ్లౌస్‌ ధరించినా వైరస్‌ వ్యాపిస్తుంది!

రూల్స్‌ బ్రేక్‌ : వ్యక్తిని బెదరగొట్టిన ఖడ్గమృగం!

కొడుకు ఆత్మహత్య.. వెళ్లలేని స్థితిలో తల్లిదండ్రులు

ఎన్నారై డాక్టర్‌ను బలిగొన్న కరోనా

సినిమా

కరోనాపై పోరాటం: సూపర్‌ స్టార్ల షార్ట్‌ఫిల్మ్‌

దేశం కోసం ఓ మంచి పని చేద్దాం : కాజల్‌

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు