తగ్గుతున్న ఐ ఫోన్ సేల్స్!

27 Jan, 2016 09:04 IST|Sakshi
తగ్గుతున్న ఐ ఫోన్ సేల్స్!

శాన్ ఫ్రాన్సిస్కో: మొబైల్ మార్కెట్లో యమా క్రేజ్ ఉన్న ఐ ఫోన్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందా.. అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. యాపిల్ సంస్థ 2007లో ఐ ఫోన్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టినప్పటి నుంచి మొదటి సారిగా సేల్స్ గ్రోత్ రేట్ పడిపోతున్నట్లు మంగళవారం వెల్లడించిన గణాంకాల్లో తెలిపింది.

ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 74.8 మిలియన్ల ఐ ఫోన్లను విక్రయించినట్లు యాపిల్ వెల్లడించింది. అయితే గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చినప్పుడు ఆశించినంత వృద్ధి మాత్రం సాధించలేదు. రాబోయే త్రైమాసికానికి విడుదల చేసిన అంచనాల్లో కూడా గత సంవత్సరంతో పోల్చినప్పుడు వృద్ధి రేటు తగ్గనుందని యాపిల్ వెల్లడించడం గమనార్హం.

యాపిల్ కంపెనీ మొత్తం రెవిన్యూలో ఐ ఫోన్ వాటానే 68 శాతంగా ఉంది. యాపిల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లుకా మాస్ట్రీ దీనిపై మాట్లాడుతూ.. అమెరికా డాలర్ బలపడటం మూలంగా యాపిల్ సేల్స్ ఫ్లాట్గా ఉన్నాయని వెల్లడించారు. ఇది కంపెనీ రెవెన్యూ మీద 5 బిలియన్ డాలర్ల మేర ప్రభావం చూపనుందని తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు