‘స్వదేశ్‌’ మహిళకు చేదు అనుభవం

29 Jan, 2017 03:00 IST|Sakshi
‘స్వదేశ్‌’ మహిళకు చేదు అనుభవం

న్యూయార్క్‌: షారూక్‌ ఖాన్  ’స్వదేశ్‌’ సినిమాకు స్ఫూర్తిగా నిలిచిన తెలుగు తేజం అరవింద పిల్లలమర్రికి అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. గతేడాది డిసెంబర్‌ 21 ఉదయం మేరీల్యాండ్‌లోని బెల్‌ ఎయిర్‌లో నడిచి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నావా? అంటూ ప్రశ్నించారు. వరుసగా ప్రశ్నలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వెళ్లడానికి వీల్లేదని, నేర విచారణ జరుగుతోందని భయపెట్టేందుకు ప్రయత్నించారు.

అరవింద గట్టిగా నిలదీయడంతో వెనక్కి తగ్గిన పోలీసులు తమ వద్ద ఉన్న కంప్యూటర్‌లో వివరాలు తెలుసుకుని ఆమెను విడిచిపెట్టారు. అరవింద భారత్‌లోనే జన్మించినా... తల్లిదండ్రులతో కలసి అమెరికాలో స్థిర నివాసం ఉంటున్నారు. 30 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆమెకు ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు