ఉ.కొరియా దిగుమతులను నిలిపేసిన చైనా

15 Aug, 2017 01:58 IST|Sakshi

బీజింగ్‌: ఐక్యరాజ్యసమితి కొత్త ఆంక్షల నేపథ్యంలో.. మిత్రదేశం ఉత్తరకొరియా నుంచి దిగుమతులను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. బొగ్గు, ఇనుము, ముడి ఇనుము, సముద్ర ఆహార ఉత్పత్తుల దిగుమతులను మంగళవారం నుంచి నిషేధిస్తున్నామని వెల్లడించింది.

గత ఫిబ్రవరి నుంచే బొగ్గు దిగుమతిని నిలిపివేయగా.. తాజాగా ఇనుము తదితరాలను నిలిపివేస్తున్నామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉ.కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మధ్య మాటల యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఆంక్షలను అమలు చేయడం వల్ల చైనాకు సుమారు రూ.6,500 కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లనుందని అంచనా.

మరిన్ని వార్తలు