ఎల్జీబీటీ సంఘానికి జుకర్ బర్గ్ మద్దతు!

28 Jun, 2016 19:25 IST|Sakshi
ఎల్జీబీటీ సంఘానికి జుకర్ బర్గ్ మద్దతు!

శాన్ ఫ్రాన్సిస్కోః ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఎల్జీబీటీ ప్రైడ్ పరేడ్ లో పాల్గొన్నారు. లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్లు శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన  పరేడ్ లో పాల్గొని, అనంతరం  ఫేస్ బుక్ లో వారికి అందించే తోడ్పాటుతో కూడని విషయాలను వివరిస్తూ  ఓ సుదీర్ఘ వ్యాసాన్ని పోస్టు చేశారు.

మార్క్ జుకర్ బర్గ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన ఎల్జీబీటీ ప్రైడ్ మార్చ్ లో పాల్గొన్న ఆయన.. ఆ సమాజ సభ్యులకు తన అండదండలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ప్రైడ్ పరేడ్స్ లో పాల్తొంటున్నారని, ఎల్జీబీటీ సమాజ సభ్యులతో తాను పెరేడ్ లో కలసి నిలబడటమే కాదు.. ఫేస్ బుక్ వారికి సురక్షితమైన స్థలంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నానని  జుకర్ బర్గ్ తన ఫేస్ బుక్ పోస్ట్ లో తెలిపారు.

తమకూ స్వేచ్ఛా, ఆనందం, జీవించే హక్కు కావాలని కోరుకుంటున్న వారిని గౌరవిస్తూ వారితో కలసి తాను ఎల్జీబీటీ నిర్వహించే నెలవారీ ప్రైడ్ సంబరాలు జరుపుకుంటున్నానని, సమానత్వంకోసం వారు చేసే పోరాటంలోనూ తాను పాల్గొన్నానని తెలిపారు. వారి సమస్యల పోరాటానికి ప్రత్యేకంగా పనిచేస్తానని తెలిపారు. ఎల్జీబీటీ ప్రైడ్ పరేడ్ కు మద్దతు పలికిన టెక్ సీఈవోల్లో ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్  మాత్రమే కాక... యాపిల్ సీఈవో టిమ్ కుక్, వారి ఉద్యోగులు కూడ పాల్గొని ఎల్జీబీటీ హక్కుల పోరాటానికి మద్దతు పలికారు.

మరిన్ని వార్తలు