సైకో వీరంగం; కాల్చి చంపిన పోలీసులు

4 Jan, 2020 11:29 IST|Sakshi

పారిస్‌ : పారిస్‌ సమీపంలోని వెల్లిజూయిఫ్‌ పార్క్‌లో శుక్రవారం సాయంత్రం ఒక వ్యక్తి కత్తితో హల్‌చల్‌ చేయడమే గాక ఒక వ్యక్తిని చంపి, మరో ఇద్దరిని కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు నిందితున్ని పట్టుకొని అక్కడిక్కడే కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే.. సౌత్‌ సెంట్రల్‌ పారిస్‌కు 8 కిమీ దూరంలో ఉన్న వెల్లిజూయిఫ్‌ పార్క్‌లోకి వచ్చిన ఒక వ్యక్తి కత్తితో తనకు అడ్డం వచ్చిన వ్యక్తిని పొడిచి చంపడమే గాక మరో ఇద్దరిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కాగా, ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో ఖురాన్ కాపీతో సహా ఇతర మతపరమైన పత్రాలు దొరికాయి. అయితే గత కొంత కాలంగా అతని మానసిక పరిస్థితి కూడా బాగుండడం లేదని, కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేరి సైకియాట్రిస్ట్‌ వద్ద చికిత్స తీసుకుంటున్నట్లు మరికొందరు పేర్కొంటున్నారు. ఇస్లాం ప్రేరేపితంతో లేక సైకోలా మారి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా  అన్న కోణంలో విచారించాస్తామని పోలీసులు తెలిపారు.కాగా, దాడిలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని మార్చురీకి తరలించగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు