సగానికి తగ్గిన హిల్లరీ ఆధిక్యం

4 Sep, 2016 02:24 IST|Sakshi
సగానికి తగ్గిన హిల్లరీ ఆధిక్యం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆధిక్యం తన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై నెల రోజుల వ్యవధిలో సగానికి తగ్గిందని తాజా సర్వేలో తేలింది. అయినా ఆమె కొన్ని కీలక ప్రాంతాల్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నారని మరో సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా జరిగిన 5 టెలిఫోన్ ఆధారిత సర్వేల్లో  క్లింటన్ సగటున 42 శాతం మంది మద్దతును, ట్రంప్ 37 శాతం మద్దతును కూడగట్టారని సీఎన్‌ఎన్ పేర్కొంది.

రెండు వరస కన్వెన్షన్ల తరువాత ‘పోల్ ఆఫ్ పోల్స్’ జరిపిన సర్వేలో క్లింటన్ 49 శాతం పాయింట్లతో, ట్రంప్ 39 శాతం పాయింట్లతో ఉన్నారని తెలిసింది.  క్లింటన్ ఆధిక్యం ట్రంప్‌పై సగటున 4.1 శాతం తగ్గిందని ప్రముఖ సర్వే సంస్థ రియల్ క్లియర్ పాలిటిక్స్ ప్రకటించింది. దీంతో శ్వేతసౌధానికి పోటీ తీవ్రతరం అవుతోందని అంచనా వేసింది. ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, ఓహియో, నెవడా, న్యూ హాంప్‌షైర్, నార్త్ కరోలినా, మిచిగాన్, విస్కాన్సిన్, కొలరాడో, వర్జీనియా, జార్జియాలో క్లింటన్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారని తెలిపింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు