పొట్టోడు.. అని నేనలేదే?!

12 Nov, 2017 09:52 IST|Sakshi

హనాయ్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మధ్య మాటల యుద్ధం వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. ట్రంప్‌ ఆసియా పర్యటన చేస్తున్న సమయంలో.. కిమ్‌ ఆయనపై వ్యక్తిగత మాటల దాడులు చేశారు. ట్రంప్‌ ఒక వృద్ధుడు, ఆయన వల్ల ఏం అవుతుందంటూ కిమ్‌ మాటల తూటాలు పేల్చాడు.

కిమ్‌ వ్యాఖ్యలపై డొనాల్డ్‌ ట్రంప్‌.. అదే విధంగా స్పందించాడు. ‘నేను ఎప్పుడన్నా.. కిమ్‌ పొట్టిగా ఉన్నాడు.. లావుగా ఉన్నాడు అని అన్నానా? నా స్నేహితుడిని నేను అలా అనగలనా? స్నేహంలో ఏదో ఒక రోజు నేను ఇలా వ్యాఖ్యానించవచ్చునేమో’ అటూ ట్వీట్‌ చేశాడు.

ట్రంప్‌ యుద్ధ పిపాసి: ఉత్తర కొరియా
డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసియా పర్యటన కేవలం యుద్ధ సన్నాహాల్లో భాగంగా చేస్తున్నారని ఉత్తర కొరియా ఆరోపించింది. ఒక విధ్వంసకారుడు.. అణుయుద్ధం కోసం ఇక్కడ పర్యటిస్తున్నాడని ట్రంప్‌పై ఉత్తరకొరియా విమర్శలు గుప్పించింది. వియాత్నాంలో ట్రంప్‌ పర్యటనపైనా ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు