పాక్ ఎంపీలతో భారత పార్లమెంటరీ బృందం భేటీ

20 Sep, 2013 04:20 IST|Sakshi

ఇస్లామాబాద్: ఎంపీ మణిశంకర్ అయ్యర్ నేతృత్వంలోని 13 మంది పార్లమెంట్ సభ్యుల ప్రతినిధి బృందం గురువారం పాకిస్థాన్ ఎంపీల బృందంతో సమావేశమైంది. భారత్-పాక్ మలిదశ చర్చలకు సానుకూల వాతావరణం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించారు. భారత ఎంపీల పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మణిశంకర్ అయ్యర్ మాట్లాడారు. ఇరుదేశాల మధ్య చర్చలు జరగాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. నవాజ్‌షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టగానే చర్చల దిశగా భారత్ సానుకూల దృక్పథంతో చూసిందని, అయితే ఇటీవలి పరిణామాలు తమ దేశ ప్రజలను నిరాశపరిచాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు