జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం...తీవ్రరూపం! | Sakshi
Sakshi News home page

జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం...తీవ్రరూపం!

Published Fri, Sep 20 2013 4:15 AM

Samaikyandhra bandh against Telangana in Vizianagaram

విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. అన్ని  వర్గాల ప్రజలు రాష్ట్ర విభజ నకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారులు 50 రోజులుగా నిర్విరామంగా ఆందోళనలు కొనసాగిస్తున్నా..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంతో గురువారం నుంచి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశారు. జిల్లా వ్యాప్తంగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి (నాన్‌పొలిటికల్ జేఏసీ) ఆధ్వర్యంలో  కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. జిల్లాలోని బ్యాంకులు, ఎల్‌ఐసీలు, పోస్టల్, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాలతో పాటు కమర్షియ ల్ ట్యాక్స్, ఆర్‌ఎంఎస్‌ఐ కార్యాలయాలను మూయించా రు. ఉద్యమకారులంతా తెల్లవారుజాము 5 గంట లకే రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసనలు వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అక్కడకక్కడ తెరిచి ఉన్న బ్యాంకులు, పేరొందిన సంస్థలను కూడా మూయించి వేశారు. 
 
 గతంలో ఎన్నడూ లేని విధంగా మణప్పురం,ఐసీఐసీఐ బ్యాంకులను కూడా బంద్ చేయించారు. జిల్లా కేంద్రంతో పాటు ఎస్. కోట, పార్వతీపురం, బొబ్బి లి, సాలూరు, చీపురుపల్లి, గజపతినగరం తదితర పట్టణా ల్లో పూర్తిస్థాయిలో బంద్ జరిగింది. విజయనగరంలో రెవె న్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పేడాడ జనార్దనరావు ఆధ్వర్యంలో ఆర్‌టీసీ కాంప్లెక్స్ ఆవరణలో గెజిటెడ్ ఉద్యో గులు, ఆర్‌టీసీ ఉద్యోగులు మానవహారం చేపట్టారు. అలా గే జేఏసీ చైర్మన్ గంటా వెంకటరావు ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకే రైల్వే ఆర్‌ఎంఎస్ కార్యాలయాన్ని ముట్టడిం చారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు బైఠాయించారు.  
 
 నిలిచిన లావాదేవీలు
 బంద్ వల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాల యాలు మూతపడ్డాయి. ప్రధాన కూడళ్ళల్లో ఉన్న ఏటీఎం  లు అధికారులు ముందుగానే మూసివేశారు. జిల్లా వ్యాప్తం గా బ్యాంకులు మూతపడడంతో సుమారు రూ. 200 కోట్ల   మేర లావాదేవీలు నిలిచిపోయాయి. పోస్టల్, ఎల్‌ఐసీ, బీ ఎస్‌ఎన్‌ఎల్, కమర్షియల్ ట్యాక్స్, ఐసీఐసీఐ వంటి బ్యాం కులు మూతపడడంతో మరో రూ. 30 కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవటానికి పోస్టల్ కార్యాలయూలకు వచ్చిన అభ్యర్థులు నిరాశతో వెనుతిరిగారు.  ఏటీఎం లు మూతపడడంతో ఖాతాదారులు ఇబ్బందులకు గురయ్యూరు. 
 
 ప్రభుత్వం స్పందించేవరకు పోరాటం ఆగదు
 రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం స్పందించేవరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు జేఏసీ నేతలు గంటా వెంకటరావు, ప్రభూజీ, పేడా డ జనార్దనరావు, తదితరులు విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం జరిగే బంద్‌కు కూడా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. అలాగే 21, 22 తేదీల్లో జరిగే స్వచ్ఛంద విద్యుత్ కోతల కార్యక్రమాన్ని కూడా ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. 24న రాష్ట్ర బంద్‌తో పాటు జాతీయ రహదారుల దిగ్బంధం ఉంటుందని తెలి పారు. వారితో పాటు జేఏసీ నేతలు డి. వి.రమణ, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేతలు లచ్చన్న, ఎంవీఎన్ వెంకటరావు, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రొంగలి ఎర్నాయుడు,లక్ష్మణప్రసాద్, గౌరీ శంకర్, సహకార ఉద్యోగ సంఘం నాయకులు లక్ష్మణరా వు, వీఆర్‌ఓ అసోసియేషన్ నాయకులు కొట్నాన శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు డి. ఈశ్వరరావు, ఏ.శివవర్మ, జేఏసీ నాయకులు పద్మనాభం, కృష్ణవేణి, జగదాంబ, తదితరులు పాల్గొన్నారు. 
 
 
 ‘విభజనను అంగీకరించేది లేదు’
 విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించేది లేదని వైద్య ఉద్యో గుల సంఘం జేఏసీ చైర్మ న్ ఇజ్రాయిల్ అన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ కేంద్రాస్పత్రి వద్ద సోనియా, దిగ్వి జయ్‌సింగ్, ఆంటోని, మంత్రి బొత్స, కేసీఆర్ మా స్క్‌లతో ఉన్న దిష్టిబొమ్మలకు ఉరితాళ్లతో వేలాడ దీసి, అనం తరం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తెలంగాణలో నాయకులు ఉద్యమాన్ని నడిపితే.. సీమాంధ్రలో ప్రజ లు, ఉద్యోగులు ఉద్యమాన్ని నడిపిస్తున్నారని తెలిపారు. ప్రపంచం లో విడిపోవడానికి ఉద్యమాలు చేస్తే.. సీమాంధ్రలో మాత్రం కలిసి ఉందామని ఉద్యమాలు చేస్తున్నారన్నారు.
 
 పజల మనోభావాలు కన్నా.. రాజకీయ నాయకు లకు పదవులే ముఖ్యమని విమర్శించారు. పీసీసీ చీఫ్ బొత్స, ఆయన కుటుంబసభ్యులు జిల్లాలో అడుగు పెట్ట డానికి భయపడుతున్నారని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వకపోతే వారికి శాశ్వతంగా ఇదే గతి పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు బి. సత్యశ్రీనివాస్, సత్యశేఖర్, వేణు గోపాల్, త్రినాథ్, వైద్య ఉద్యోగుల సంఘం నాయకులు, ఆచారి, చిన్నంనాయుడు, ఉమాపతి, బాలాజీ ప్రాణిగ్రాహి, తదితరులు పాల్గొన్నారు.
 
 ఆకట్టుకున్న తెలంగాణ విద్యార్థిని ప్రసంగం
 బొబ్బిలి టౌన్, న్యూస్‌లైన్ : తెలంగాణ  (వరంగల్)లో పుట్టి అక్కడే పెరిగి తండ్రి ఉద్యోగ రీత్యా బొబ్బిలిలోని రఘు జూనియర్ కళాశాల చదువుతున్న విద్యార్థిని మహి తా మాన్వి.. తెంటు ఆమరణ దీక్షా శిబిరంలో చేసిన ప్రసంగం పలువుర్ని ఆకట్టుకుంది.  తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఆలోచన విద్యార్థులకు లేదని, కలిసి ఉండాలని కో రుతున్నా.. కొందరు స్వార్థపరులు విడిపోదామని అంటున్నారని చెప్పారు. ఆ ప్రాంతీయు లు, ఈ ప్రాంత ప్రజలకు ఉన్న తేడాను వివరిస్తూ.. విడిపోతే అన్నీ కష్టాలేనని అన్నారు.
 
 తెలంగాణ ఉద్యోగికి అభినందనలు 
 శృంగవరపుకోట : సమైక్యాంధ్ర ఉద్యమానికి సంఘీభావం తెలిపిన తెలంగాణ ఉద్యోగిని జేఏసీ సభ్యులు అభినందిం చారు. స్థానిక డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన కృష్ణచంద్రకీర్తిని జేఏసీ నేతలు కలిశారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు ఆయన అంగీకారం తెలపడంతో జేఏసీ సభ్యు  లు అతనికి పూలమాల వేసి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కృష్ణచంద్రకీర్తిని చూసి సిగ్గుపడా లంటూ ఆంధ్రప్రాంతానికి చెందిన ఇద్దరు లెక్చరర్లు, లైబ్రేరియన్, ప్రిన్సిపాల్ తీరుపై జేఏసీ సభ్యులు ఘాటుగా విమ ర్శలు చేశారు.
 
 విభజిస్తే ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం
 బెలగాం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన జరిగితే ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యా యం జరుగుతుందని ఆర్‌టీసీ ఎంప్లాయూస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి (విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు) పి. భానుమూర్తి అన్నారు. గురు వారం పట్టణంలోని రెవెన్యూ హోమ్‌లో జరిగిన ఆర్‌టీసీ ఈయూ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియ నిలిచిపోయే వరకు ఆర్‌టీసీ సమ్మె కొనసాతుందన్నా రు. ఉద్యమం వల్ల ప్రజలు ఇబ్బం దులు పడుతున్నా.. ప్రభుత్వం, కేం ద్ర మంత్రులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఉద్యమకారు లపై రాజకీయ పార్టీల కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అనంతరం కార్మికులతో ప్రతిజ్ఞ చేయిం చారు.
 
     ఈ సమావేశంలో ఈయూ పార్వతీపురం డిపో కార్యదర్శి మరిపి శ్రీనివాసరావు, అధ్యక్షుడు పీఎస్ రాజు, నాయకులు టి. వి. నాయుడు, కె. శంకరరావు, అన్నపూర్ణ, ఎం. ఎస్.రావు, నారాయణ, పాల్గొన్నారు. 
 
 అదే జోరు... హోరు
 బెలగాం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నారుు. పార్వతీపురం పట్టణంలో గురువారం ఇంటర్ విద్యా జేఏసీ ఉద్యోగులు మోకాళ్లపై నిరసన వ్యక్తం చేసి, చర్చ వీధి జంక్షన్‌లో రిలే దీక్షలు చేపట్టా రు. ఈ సందర్భంగా వంగపండు ఆటాపాట ఉద్యమకారులను ఉత్తేజపరిచింది. అలాగే  ప్రభుత్వ గురుకులాల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు కేంద్ర మం త్రుల మాస్క్‌లు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ డి. లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలి పారు. చర్చి జంక్షన్‌లో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉ పాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టి, మానవహారం నిర్వహిం చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అమరాపు సూర్యనారాయణ, బొత్స రవికు  మార్, తదితరులు పాల్గొన్నారు. కోర్టు జంక్షన్ వద్ద న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నా రుు. ఆర్‌టీసీ ఉద్యోగులు  పట్టణంలో భారీ ర్యాలీ, నిర్వహించి, కాంప్లెక్స్ వద్ద మానవహారం చేపట్టారు. స్థానిక ఎల్‌ఐసీ బ్రాంచి ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి ఇంటర్ విద్యా జేఏసీ, ఉపాధ్యాయులు జేఏసీ, న్యాయవాదులు, ఏపీ ఎన్‌ఈఓల ఆధ్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలను సందర్శించి, సంఘీభా వం తెలిపారు. 
 
 వెయ్యి అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నేడు
 చీపురుపల్లి రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో శుక్రవారం వెయ్యి అడుగుల జాతీయ జెండా తో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు జేఏసీ నేతలు తెలిపారు. ఈ మేరకు గురువారం అన్ని సంఘాల జేఏసీ కన్వీనర్లు జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఉదయం 10 గంటలకు మూడు రోడ్ల కూడలి నుంచి గాంధీ సెంటర్ వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని, విజయవంతం చేయూలని కోరారు. సమావేశంలో బెల్లాన చంద్రశేఖర్, పరిరక్షణ వేదిక చైర్మన్ టి. రామకృష్ణ, ఇప్పిలి అనంతరం, వలి రెడ్డి శ్రీను, కన్వీనర్లు రవీంద్రనాయుడు, మీసాల అప్పలనాయుడు, సువ్వాడ అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement