పాక్‌లో భారత ఖైదీల విడుదల

24 Aug, 2013 06:53 IST|Sakshi
పాక్‌లో భారత ఖైదీల విడుదల

కరాచీ: తమ జైళ్లలో ఉన్న 337 మంది భారత ఖైదీలను  పాకిస్తాన్ శుక్రవారంనాడు విడుదల చేసింది. వారిలో ఎక్కువమంది జాలర్లు ఉన్నారు. నియంత్రణ రేఖ వద్ద కాల్పుల ఘటనలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఖైదీల విడుదల ప్రాధాన్యం సంతరించుకుంది. కరాచీలోని మాలిర్ జైలు నుంచి 329 మంది ఖైదీలను, లాంథి  జైలు నుంచి ఎనిమిది మంది బాలలను విడుదల చేసినట్లు దక్షిణసింథ్ రాష్ర్ట హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. మాలిర్‌లో మరో ఖైదీ ఉన్నారని, అయితే అతని జాతీయతపై సందేహాలు నెలకొనడంతో  విడుదల చేయలేదన్నారు.

>
మరిన్ని వార్తలు