అమెరికాలో అంతర్జాతీయ హిందీ సమ్మేళనం

6 Apr, 2015 01:44 IST|Sakshi
అమెరికాలో అంతర్జాతీయ హిందీ సమ్మేళనం

సాక్షి, హైదరాబాద్: భారత దౌత్య కార్యాలయం, రాత్గేర్ యూనివర్సిటీ, న్యూయార్క్‌లోని హిందీ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ హిందీ సమ్మేళనం ఆదివారం ప్రారంభమైంది. న్యూయార్క్‌లోని భారత దౌత్యవేత్త జ్ఞానేశ్వర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం హిందీ భాషకు అగ్రస్థానం కల్పిస్తోందని జ్ఞానేశ్వర్ కొనియాడారు. మూడు రోజుల పాటు సాగనున్న ఈ సమ్మేళనంలో హిందీ భాషకు ఎదురవుతున్న సమస్యలపై చర్చిస్తారు. హిందీ రచనలు, రచయితలకు భారతదేశంలో సముచిత స్థానం కల్పించకపోతే హిందీ ఎప్పటికీ విశ్వ భాష కాలేదని కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అమెరికాలోని భారతీయ విద్యాభవన్‌కు చెందిన సీకే రావు, జయరామన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సత్యనారాయణ, పెన్సిల్వేనియా యూనివర్సిటీ హిందీ ప్రొఫెసర్ డా. గార్నెనితో పాటు వివిధ దేశాల నుంచి ఎంపికైన 200 మంది ప్రముఖులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు